Akhil Akkineni: జూన్ 6న అక్కినేని అఖిల్ పెళ్లి?

Akhil Akkineni wedding on June 6th
  • జైనబ్ రవ్‌డ్జీతో అఖిల్ పెళ్లి
  • పెళ్లి సందడి అప్పుడే మొదలైనట్టు వార్తలు
  • గత ఏడాది నవంబర్ 26న జరిగిన అఖిల్, రవ్‌డ్జీ నిశ్చితార్థం
అక్కినేని కుటుంబంలో పెళ్లి సందడి మొదలైనట్లు తెలుస్తోంది. యువ హీరో అక్కినేని అఖిల్ ఓ ఇంటివాడు కాబోతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తె జైనబ్ రవ్‌డ్జీతో అఖిల్ వివాహం జరగనుంది. ఈ పెళ్లి జూన్ 6న జరగనుందనే వార్త వైరల్ అవుతోంది. 

గత కొంతకాలంగా అఖిల్, జైనబ్ ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. గత ఏడాది నవంబర్ 26న వీరి నిశ్చితార్థం వైభవంగా జరిగింది. నిశ్చితార్థం అనంతరం ఈ జంట పలుమార్లు కలిసి విహారయాత్రలకు వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా వీరి వివాహ తేదీ ఖరారైందని, జూన్ 6న అఖిల్, జైనబ్ ఏడడుగులు వేయనున్నారని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని వినికిడి.
Akhil Akkineni
Akhil Akkineni wedding
Zainab Ravjee
Akkineni family
Telugu cinema
Celebrity wedding
Engagement
June 6 wedding

More Telugu News