Rukmini Vasanth: అందగత్తెల వెంటపడుతున్న అదృష్టం!

Rukmini Vasanth Special
  • కన్నడలో బిజీ అవుతున్న రుక్మిణీ వసంత్ 
  • పెరుగుతున్న స్టార్ డమ్ 
  • తెలుగు .. తమిళ భాషల నుంచి ఆఫర్స్ 
  • పెద్ద హీరోల జోడీగా వినిపిస్తున్న పేరు  

ఒకప్పుడు బాలీవుడ్ నుంచి .. కోలీవుడ్ నుంచి టాలీవుడ్ కి అందమైన భామలు క్యూ కట్టేవారు. ఆ తరువాత కాలంలో మలయాళ బ్యూటీలు తరలిరావడం ఎక్కువైంది. అయితే ఇటీవల కాలంలో మాత్రం కన్నడ నుంచి దిగుతున్న అందగత్తెల సంఖ్య కూడా పెరుగుతూ వెళుతోంది. అలాంటి వారి జాబితాలో ఇప్పుడు ఎక్కువగా రుక్మిణీ వసంత్ పేరు వినిపిస్తోంది. 

రుక్మిణీ వసంత్ పేరు వినగానే 'సప్త సాగరాలు దాటి' సినిమా గుర్తుకు వస్తుంది. ఈ కన్నడ హిట్ తోనే రుక్మిణి కెరియర్ జోరందుకుంది. చాలా సింపుల్ గా కనిపిస్తూనే, చూపులన్నింటినీ తన చుట్టూ తిప్పుకోవడం ఆమె ప్రత్యేకత. సహజమైన నటన .. హావభావ విన్యాసం ఆమెకి మంచి మార్కులు .. మరింత క్రేజ్ ను తెచ్చిపెడుతున్నాయి. దాంతో అదృష్టం కూడా ఇప్పుడు అందగత్తెల వెంటనే పడుతోందని అంతా చెప్పుకుంటున్నారు. 

ఆల్రెడీ విజయ్ సేతుపతితో కలిసి నటించిన రుక్మిణి, శివకార్తికేయన్ తో కలిసి 'మదరాసి'లో నటించింది. సెప్టెంబర్ 5వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. ఇక ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ తెరకెక్కించనున్న 'డ్రాగన్' సినిమాలో కూడా ఈ భామ పేరే వినిపిస్తోంది. అలాగే త్రివిక్రమ్ - వెంకటేశ్ కాంబినేషన్లోను, సందీప్ రెడ్డి వంగా - ప్రభాస్ కాంబినేషన్లోను ఆమె పేరు వినిపిస్తోంది. చూస్తుంటే రుక్మిణీ వసంత్ కన్నడలో కంటే ఎక్కువగా తెలుగులో బిజీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి మరి!

Rukmini Vasanth
Rukmini Vasanth movies
Sapta Sagaralu Dati
Madarasi movie
NTR Dragon movie
Prashanth Neel
Sandeep Reddy Vanga Prabhas movie
Tollywood actresses
Kannada actress
Vijay Sethupathi

More Telugu News