Menteparthi Parthasarathi: మహానాడులో పార్టీ వార్షిక నివేదికను ప్రవేశపెట్టిన కోశాధికారి

Mente Parthasarathi Presents TDP Annual Report at Mahanadu
--
గత ఆర్థిక సంవత్సరంలో తెలుగుదేశం పార్టీకి సభ్యత్వం రూపంలో రూ.123.73 కోట్లు వచ్చాయని టీడీపీ కోశాధికారి మెంటె పార్థసారథి పేర్కొన్నారు. ఈ మేరకు మహానాడు వేదికపై ఆయన మాట్లాడుతూ.. మహానాడుకు విచ్చేసిన టీడీపీ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. 2024 -2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి టీడీపీ వార్షిక ఆర్థిక నివేదక వివరాలను సంక్షిప్తంగా వెల్లడించారు. 

పార్టీకి వచ్చిన ఆదాయం..
  • సభ్యత్వ రుసుముల ద్వారా రూ. 123.19 కోట్లు,
  • విరాళాల ద్వారా వచ్చిన ఆదాయం రూ. 82.5 కోట్లు
  • వడ్డీపై ఆదాయం 23.5 కోట్లు
  • అద్దె రూపంలో 2 లక్షలు 
  • మొత్తంగా రాబడి రూ.228.30 కోట్లు

ఖర్చులు..
  • ప్రచారం కోసం వెచ్చించిన మొత్తం రూ. 31.73 కోట్లు
  • ఆఫీసు అద్దె చెల్లింపు 14 లక్షలు
  • ఆఫీసు ఖర్చులు 7.99 కోట్లు
  • తరుగుదల 4.39 కోట్లు
  • ఉద్యోగుల జీతాలు రూ.71 లక్షలు
  • కార్యకర్తల సంక్షేమ బీమా రూ.15.84 కోట్లు
  • ఇతర ఖర్చులు 53 లక్షలు
  • 2025 వార్షిక సంవత్సరం కార్యకర్తల సంక్షేమానికి బీమా చెల్లింపు రూ. 48.9 కోట్లు
  • మొత్తం ఖర్చు రూ. 61.33 కోట్లు
  • మిగిలిన సొమ్ము రూ. 166.98 కోట్లు
31.03.2025 కు పార్టీ జనరల్ ఫండ్ విలువు రూ. 469.42 కోట్లు
Menteparthi Parthasarathi
TDP
Telugu Desam Party
Mahanadu
Party Annual Report
Financial Report
Andhra Pradesh Politics
Party Funds
Donations
Party Membership

More Telugu News