Nara Lokesh: 'అర్థమైందా రాజా' అంటూ మహానాడులో నారా లోకేశ్ వ్యంగ్యం

Nara Lokesh Proposes Six Laws for TDP Future
  • పేదరికం లేని సమాజాన్ని నిర్మించడమే టీడీపీ లక్ష్యమన్న లోకేశ్
  • తెలుగు జాతి ప్రయోజనాల కోసమే టీడీపీ ఆవిర్భవించిందని వెల్లడి
  • పార్టీకి కార్యకర్తలే బలమని, వారికి శిరసు వంచి నమస్కరిస్తున్నానన్న లోకేశ్
పేదరికం లేని సమాజాన్ని నిర్మించడమే తెలుగుదేశం పార్టీ ప్రధాన లక్ష్యమని, తెలుగు జాతి ప్రయోజనాల పరిరక్షణ కోసమే ఈ పార్టీ ఆవిర్భవించిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ తెలిపారు. కడపలో జరుగుతున్న టీడీపీ మహానాడులో ఆయన మాట్లాడుతూ, మారుతున్న కాలానికి అనుగుణంగా పార్టీలో కూడా మార్పులు రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

రాబోయే 40 సంవత్సరాల పాటు పార్టీని విజయవంతంగా నడిపించడానికి అవసరమైన అంశాలపై ఈ మహానాడు వేదికగా సమగ్రంగా చర్చించాలని పిలుపునిచ్చారు. పార్టీ జెండాను ఎత్తుకున్నప్పటి నుంచి దించకుండా కాపలా కాసిన ప్రతి కార్యకర్తకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానని ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

మంత్రి నారా లోకేశ్ తన ప్రసంగంలో, "తెలుగు వారి కడుపు నిండా భోజనం పెట్టిన పార్టీ తెలుగుదేశం. తెలుగుజాతి ఆత్మగౌరవానికి, అన్నదాతకు అండగా నిలిచిన పార్టీ మనది. ఎన్టీఆర్ గారు పార్టీ స్థాపించిన ముహూర్త బలం చాలా గొప్పది" అని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో 58 మంది తొలిసారిగా ఎన్నికైన శాసనసభ్యులు ఉన్నారని తెలిపారు. మెగా డీఎస్సీ ద్వారా 16,347 మంది కొత్త ఉపాధ్యాయులను నియమించబోతున్నామని ఆయన వెల్లడించారు. 

గత ప్రభుత్వ హయాంలో అసెంబ్లీ సాక్షిగా తల్లులను అవమానించారని, సొంత తల్లి, చెల్లిని మెడపట్టి బయటకు గెంటేశారని ఆరోపిస్తూ, 'అర్థమైందా రాజా' అంటూ వ్యంగ్యంగా లోకేశ్ వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీకి ప్రతిపక్షంలో ఉండటంగానీ, అధికారంలో ఉండటంగానీ కొత్త విషయం కాదని ఆయన పేర్కొన్నారు.
Nara Lokesh
TDP Mahanadu
Telugu Desam Party
Andhra Pradesh Politics
Youth Empowerment
Women Empowerment
Farmers Welfare
Social Engineering
Telugu People
Party Activists

More Telugu News