Nara Lokesh: టీడీపీ మహానాడులో 'నా తెలుగు కుటుంబం' లోగో ఆవిష్కరణ

- 'నా తెలుగు కుటుంబం' పేరుతో లోకేశ్ ఆరు కీలక శాసనాల ప్రతిపాదన
- ఈ శాసనాలను తప్పకుండా అమలు చేస్తామని ఆయన హామీ
- తెలుగు జాతికి విశ్వవ్యాప్త కీర్తి తేవడమే లక్ష్యం
కడపలో తెలుగుదేశం పార్టీ మహానాడు ఘనంగా ప్రారంభమైంది. టీడీపీ జాతీయ అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, టీడీపీ అగ్రనేతలు, కార్యకర్తలతో మహానాడు ప్రాంగణం వెలిగిపోతోంది. ఈ కార్యక్రమంలో నా తెలుగు కుటుంబం లోగో ఆవిష్కరించారు. నా తెలుగు కుటుంబం... ఆరు శాసనాలతో కూడిన కార్యాచరణ. లోగో ఆవిష్కరించిన అనంతరం నారా లోకేశ్ మాట్లాడుతూ తెలుగు ప్రజల సమగ్రాభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ఆరు కీలక శాసనాలను తీసుకువచ్చినట్లు వెల్లడించారు.
ఈ ఆరు సూత్రాలను రాబోయే రోజుల్లో కచ్చితంగా అమలు చేసి తీరుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, సమాజంలోని అన్ని వర్గాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ శాసనాలను రూపొందించినట్లు ఆయన తెలిపారు. ఈ ఆరు శాసనాలను ఒక పవిత్రమైన బాధ్యతగా స్వీకరించి, వాటిని అక్షరాలా అమలు చేసి, ప్రజల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకువస్తామని లోకేష్ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.
.