Kavitha: జూన్ 2న కవిత కొత్త పార్టీ ప్రకటిస్తారు: రఘునందన్ రావు జోస్యం

Kavitha to Announce New Party on June 2 Says Raghunandan Rao
  • షర్మిల మాదిరి కవిత పాదయాత్ర చేస్తారన్న రఘునందన్ రావు
  • దెయ్యాల మధ్య కవిత పదేళ్లు ఎలా ఉన్నారని ప్రశ్న
  • తండ్రీకూతుళ్ల మధ్య మధ్యవర్తులు ఎందుకన్న రఘునందన్ రావు
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాసిన లేఖ తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ లేఖపై ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తుండగా, తాజాగా మెదక్ ఎంపీ, బీజేపీ నేత రఘునందన్ రావు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. 

జూన్ 2వ తేదీన ఎమ్మెల్సీ కవిత కొత్త పార్టీని ప్రకటించబోతున్నారని రఘునందన్ రావు జోస్యం చెప్పారు. ఆ తర్వాత ఆమె తెలంగాణ వ్యాప్తంగా వైఎస్ షర్మిల మాదిరి పాదయాత్ర కూడా చేపడతారని ఆయన వ్యాఖ్యానించారు. "కవిత గెలిచినప్పుడు కేసీఆర్ దేవుడయ్యారు. మరి ఇప్పుడు ఆయనే దెయ్యం ఎలా అయ్యారు?" అంటూ రఘునందన్ రావు సందేహం వ్యక్తం చేశారు. "అలాంటి దెయ్యాల మధ్య పదేళ్ల పాటు రాజకీయం ఎందుకు చేసినట్లు?" అంటూ కవితను ఉద్దేశించి ఆయన చురకలంటించారు. కవిత వద్దకు కేసీఆర్ మధ్యవర్తులను పంపించారని... తండ్రీకూతుళ్ల మధ్య మధ్యవర్తులు ఎందుకని ప్రశ్నించారు. 
Kavitha
KCR
Kalvakuntla Kavitha
BRS
Raghunandan Rao
Telangana Politics
New Party
YS Sharmila
Medak MP

More Telugu News