Nara Lokesh: "నువ్వు మగాడ్రా బుజ్జి" అని నారా లోకేశ్ తో చెప్పమన్నాడు: మంత్రి టీజీ భరత్

TG Bharat Praises Nara Lokesh Yuvagalam Padayatra
  • కడప టీడీపీ మహానాడులో మంత్రి టీజీ భరత్ ప్రసంగం
  • నారా లోకేశ్ యువగళం పాదయాత్రపై ప్రశంసల వర్షం
  • ఎంతో పట్టుదలతో 3 వేల కి.మీ పాదయాత్ర చేశారని కితాబు
తెలుగుదేశం పార్టీ కడపలో నిర్వహిస్తున్న మహానాడు వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చోటుచేసుకున్నాయి. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తన ప్రసంగంలో... పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర పట్ల తనకున్న అభిమానాన్ని, ప్రశంసలను వ్యక్తం చేశారు. లోకేశ్ చూపిన పట్టుదల, ప్రజా సమస్యలపై ఆయనకున్న అవగాహనను మంత్రి కొనియాడారు.

"నారా లోకేశ్ గారు యువగళం పాదయాత్ర చేసేటప్పుడు, కొందరు వారం తర్వాత పాదయాత్ర ఉండదు అన్నారు... కానీ లోకేశ్ గారు ఎంతో పట్టుదలతో దాదాపు 3 వేల కి.మీ. పైగా పాదయాత్ర చేశారు. జనాలతో మమేకమై ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. వారి బాధలను చూశారు. వారి కన్నీళ్లు చూశారు. అధికారంలోకి వచ్చాక వారికి అండగా ఉన్నారు. నారా లోకేశ్ కు ఓ మాట చెప్పమని నా స్నేహితుడు అన్నాడు. “నువ్వు మగాడ్రా బుజ్జి” అని చెప్పమన్నాడు" అని టీజీ భరత్ వెల్లడించారు. దాంతో మహానాడు ప్రాంగణం చప్పట్లతో, నినాదాలతో మార్మోగింది.
Nara Lokesh
TG Bharat
Telugu Desam Party
Yuvagalam Padayatra
Kadapa Mahanadu
Andhra Pradesh Politics
Political Speech
Prajagalam
AP Industries Minister

More Telugu News