RCB: ఈ సీజన్ లో ఇదే చివరి లీగ్ మ్యాచ్... లక్నోపై టాస్ గెలిచిన ఆర్సీబీ

RCB Wins Toss Against Lucknow in Final League Match
  • ఐపీఎల్ లీగ్ దశకు నేటితో తెర
  • లక్నో సూపర్ జెయింట్స్ × రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
  • లక్నోలోని వాజ్ పేయి స్టేడియంలో మ్యాచ్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీ
ఐపీఎల్-2025 సీజన్ లో లీగ్ దశకు నేటితో తెరపడనుంది. నేడు టోర్నీ చివరి లీగ్ మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ కు లక్నోలోని వాజ్ పేయి స్టేడియం వేదికగా నిలుస్తోంది. టాస్ గెలిచిన ఆర్సీబీ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో గెలిచి టాప్-2లోకి ఎంటరవ్వాలని బెంగళూరు టీమ్ భావిస్తోంది. 

ఈ మ్యాచ్ లో ఆర్సీబీ ఓడిపోతే ముంబయి ఇండియన్స్ తో ఎలిమినేటర్ మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. గెలిస్తే పంజాబ్ కింగ్స్ తో క్వాలిఫయర్-1లో తలపడుతుంది. అందుకే, ఇవాళ లక్నో సూపర్ జెయింట్స్ తో మ్యాచ్ లో సర్వశక్తులు ఒడ్డాలని ఆర్సీబీ కోరుకుంటోంది.

మరోవైపు, లక్నో సూపర్ జెయింట్స్ టోర్నీ నుంచి ఎప్పుడో ఎలిమినేట్ అయింది. ప్లే ఆఫ్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో సన్ రైజర్స్ చేతిలో ఓటమిపాలైంది.
RCB
Royal Challengers Bangalore
Lucknow Super Giants
IPL 2025
Vajpayee Stadium
LSG
Cricket
T20
Indian Premier League

More Telugu News