Manchu Vishnu: సోషల్ మీడియాలో మంచు విష్ణు ఆసక్తికర పోస్టు

- జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానున్న మంచు విష్ణు 'కన్నప్ప'
- ఈ నెల 25న మూవీలో కీలక సన్నివేశాలకు సంబంధించిన హార్డ్ డ్రైవ్ అపహరించిన ఆఫీస్ బాయ్ రఘు
- ఫిల్మ్ నగర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విజయ్ కుమార్
- నాకెందుకు ఈ పరీక్ష స్వామీ అంటూ మంచు విష్ణు ఆసక్తికర పోస్టు
- సోషల్ మీడియాలో విష్ణు పోస్టు వైరల్
హీరో మంచు విష్ణు సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్ పెట్టారు. మంచు విష్ణు కీలక పాత్రలో నటించిన తాజా మూవీ 'కన్నప్ప' ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకుంది. జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానున్న తరుణంలో 'కన్నప్ప'ను మరో సమస్య చుట్టుముట్టింది. మూవీలో కీలక సన్నివేశాలకు సంబంధించిన హార్డ్‌డ్రైవ్ అనుమతి లేకుండా బయటకు తీసుకువెళ్లడం హాట్ టాపిక్ అయింది.
ఈ ఘటనపై ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. ఇప్పటికే మూవీ ప్రచార కార్యక్రమంలో బిజీబిజీగా ఉన్న మంచు విష్ణుకు ఈ సమస్య కొత్త తలనొప్పిగా మారింది. దీంతో ఆ పరమ శివుడిని ప్రశ్నిస్తూ మంచు విష్ణు ఆసక్తికర పోస్ట్ పెట్టాడు. 'జటాజూటధారీ, నీకోసం తపస్సు చేసే నాకెందుకు ఈ పరీక్ష స్వామీ? #హరహరమహదేవ్' అంటూ ఎక్స్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మంచు విష్ణుకు ఎదురైన పరిస్థితి చూసి ఆయన అభిమానులు ఎక్స్ వేదికగా ధైర్యం చెబుతున్నారు.
ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ప్రైవేటు లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విజయ్‌కుమార్ వద్ద ఆఫీస్ బాయ్‌గా పని చేసే రఘు అనే వ్యక్తి ఈ నెల 25న ఈ మూవీకి సంబంధించిన హార్డ్‌డ్రైవ్‌ను తస్కరించి చరిత అనే మహిళకు అప్పగించాడు. అపహరణకు గురైన హార్డ్‌డిస్క్‌లో 1.30 గంటల సినిమా ఉందని, ముఖ్యంగా ప్రభాస్‌కు సంబంధించిన కీలక యాక్షన్ సీక్వెన్స్ అందులో ఉన్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో తమ ప్రాజెక్టుకు నష్టం కల్గించాలనే దురుద్దేశంతో రఘు, చరితలు కలిసి ఇలా చేస్తున్నారని విజయ్‌కుమార్ ఫిల్మ్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.