Neeraj Chopra: 'ఆడి' బ్రాండ్ అంబాసిడర్‌గా నీరజ్ చోప్రా

Neeraj Chopra Becomes Audi Brand Ambassador
  • ఆడి కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్న నీరజ్ చోప్రా
  • అధికారికంగా వెల్లడించిన ఆడి ఇండియా అధిపతి బల్బీర్ సింగ్ ధిల్లాస్ 
లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి ఇండియాతో ఒలింపిక్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా భాగస్వామ్యం కుదుర్చుకున్నారు. ఈ విషయాన్ని జర్మన్ ఆటోమోటివ్ దిగ్గజ సంస్థ ఆడి ఇండియా అధికారికంగా వెల్లడించింది. ఇందుకు సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ విషయాన్ని జేఎన్ డబ్ల్యు స్పోర్ట్స్ కూడా ధృవీకరించింది.

‘నీరజ్ చోప్రా శ్రేష్ఠతకు మాత్రమే కాదు.. దృఢ సంకల్పం, ముందుకు సాగడానికి చిహ్నం. చోప్రా దృష్టి, వేగం, అసమానమైన పనితీరు తమ బ్రాండ్‌తో సంపూర్ణంగా సరిపోతాయి’ అని ఆడి ఇండియా అధిపతి బల్బీర్ సింగ్ ధిల్లాన్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.

ఆడి ఇండియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారత మార్కెట్‌లో అత్యధిక ప్రజాదరణ పొందుతున్న సంస్థల్లో ఆడి ఇండియా ఒకటి. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో అమ్మకాల్లో 17 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఎప్పటికప్పుడు సరికొత్త మోడల్స్‌ను తీసుకువస్తూ ప్రత్యర్థులకు గట్టి పోటీని ఇస్తున్న ఈ కంపెనీ గత ఏడాది భారత మార్కెట్‌లో లక్ష కార్లను విక్రయించింది.

ఇటీవల రూ.2.49 కోట్ల (ఎక్స్ షోరూమ్) ధరతో ఆర్ఎస్ క్యూ 8 పెర్ఫార్మెన్స్ కారును ఆడి ఇండియా విడుదల చేసింది. 
Neeraj Chopra
Audi India
Luxury cars
Brand ambassador
Balbir Singh Dhillon
Automotive
RS Q8 Performance
Sports
Olympic Gold Medal

More Telugu News