Sanjay: ఐపీఎస్ అధికారి సంజయ్ సస్పెన్షన్ మరో ఆరు నెలలు పొడిగింపు

IPS Sanjay Suspension Extended for Six More Months
  • గత ప్రభుత్వంలో అగ్నిమాపక శాఖ డీజీ, సీఐడీ చీఫ్‌గా బాధ్యతలు నిర్వహించిన సంజయ్
  • నిధుల దుర్వినియోగం అభియోగాలపై గత ఏడాది డిసెంబర్ 3న సస్పెండ్ చేసిన ప్రభుత్వం 
రాష్ట్ర ప్రభుత్వం సీనియర్ ఐపీఎస్ అధికారి ఎన్. సంజయ్ సస్పెన్షన్‌ను మరో ఆరు నెలల పాటు పొడిగించింది. నవంబర్ 27 వరకు ఆయనపై సస్పెన్షన్ విధిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సంజయ్ అగ్నిమాపక శాఖ డీజీగా, సీఐడీ చీఫ్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఈ సమయంలో నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారన్న అభియోగంపై గత ఏడాది డిసెంబర్ 3న ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసింది. సస్పెన్షన్ గడువు ఈ నెల 31తో ముగియనుంది.

ఏసీబీ కేసు దర్యాప్తు పెండింగ్‌లో ఉండటం, సాక్షులను ఇంకా విచారించాల్సి ఉండటంతో సంజయ్ సస్పెన్షన్‌ను మరికొన్నాళ్లు పొడిగించాలని రివ్యూ కమిటీ నిర్ణయించింది. దీని ఆధారంగా తాజాగా ఆయన సస్పెన్షన్‌ను పొడిగిస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. 
Sanjay
IPS Sanjay
N Sanjay
AP CID Chief
Fire Services DG
Andhra Pradesh Government
Suspension Extended
Fund Misappropriation
ACB Investigation
Vijayanand

More Telugu News