Sajjala Bhargava Reddy: పోలీసు విచారణకు హాజరైన సజ్జల భార్గవరెడ్డి

- పవన్, లోకేశ్ లపై అనుచిత వ్యాఖ్యల కేసు
- మంగళగిరి రూరల్ పీఎస్ కు వచ్చిన భార్గవ్
- భార్గవ్ ను ప్రశ్నిస్తున్న పోలీసులు
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ పై అనుచిత వ్యాఖ్యల కేసులో వైసీసీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సజ్జల భార్గవరెడ్డి విచారణకు హాజరయ్యారు. మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కు ఆయన వచ్చారు. కేసు విచారణకు సంబంధించి ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే ఆయన పోలీసులు రమ్మన్న సమయం కంటే ముందుగానే పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. ప్రస్తుతం భార్గవ్ ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.