Hari Hara Veera Mallu: 'హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు' నుంచి 'తార తార' సాంగ్ వ‌చ్చేసింది

Hari Hara Veera Mallu Tara Tara Song Released
  • పవన్ కల్యాణ్ హీరోగా తాజా చిత్రం 'హరిహర వీరమల్లు'
  • జూన్ 12న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న సినిమా
  • 'తార తార నా క‌ళ్లు.. వెన్నెల పూత నా ఒళ్లు' పాట‌ను విడుద‌ల చేసిన మేక‌ర్స్
  • ఈ పాటకు శ్రీహ‌ర్ష లిరిక్స్ అందించ‌గా.. ఆల‌పించిన‌ లిప్సిక‌, ఆదిత్య అయ్యంగార్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ న‌టించిన తాజా చిత్రం 'హరిహర వీరమల్లు'. ఈ పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచరస్ నుంచి మరో పాటను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇప్పటికే విడుద‌లైన‌ 'మాట వినాలి', 'కొల్లగొట్టినాదిరో', 'అసుర హననం' సాంగ్స్ శ్రోతుల‌ను ఆక‌ట్టుకున్నాయి.

తాజాగా హీరోయిన్ నిధి అగర్వాల్ సాంగ్ రిలీజ్ చేశారు. 'తార తార నా క‌ళ్లు.. వెన్నెల పూత నా ఒళ్లు' అంటూ సాగే ఈ పాటకు శ్రీహ‌ర్ష లిరిక్స్ అందించ‌గా... లిప్సిక‌, ఆదిత్య అయ్యంగార్ ఆల‌పించారు. నిధి అగర్వాల్ త‌న అందాల‌తో ఆక‌ట్టుకుంది.

ఈ మూవీని రెండు పార్టులుగా తెరకెక్కించనుండగా.. ఫస్ట్ పార్ట్ 'హరిహర వీరమల్లు: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్' పేరుతో జూన్ 12న వ‌ర‌ల్డ్‌వైడ్‌గా రిలీజ్ కానుంది. పవన్ సరసన హీరోయిన్‌గా నిధి అగర్వాల్ నటించగా.. అనుపమ్ ఖేర్, బాబీ డియోల్, నోరాహి ఫతేహి, విక్రమ్ జీత్, జిషుసేన్ గుప్తా, సునీల్, నాజర్, కబీర్ సింగ్, సుబ్బరాజు తదితరులు ఇత‌ర‌ కీలక పాత్రలు పోషించారు. 

ప్ర‌ముఖ‌ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై ఎ.దయాకర్‌రావు మూవీని నిర్మిస్తున్నారు. క్రిష్ జాగ‌ర్లమూడి, జ్యోతికృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ విజేత‌ ఎం.ఎం.కీరవాణి బాణీలు అందించారు.

Hari Hara Veera Mallu
Pawan Kalyan
Nidhi Agarwal
MM Keeravani
Krish Jagarlamudi
Tara Tara Song
Telugu Movie Song
AM Ratnam
Mega Surya Production
Telugu Cinema

More Telugu News