Virat Kohli: ప్లేఆఫ్స్ కు చేరుకున్న ఆనందంలో భార్యకు ఫ్లయింగ్ కిస్ విసిరిన విరాట్.. వీడియో ఇదిగో!

Virat Kohli Flying Kiss to Anushka Sharma After RCB Victory
  • లక్నో ఏకానా స్టేడియంలో క్యూట్ మూమెంట్
  • సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో
  • విరుష్క జోడీకి అభిమానుల ప్రశంసలు
ఐపీఎల్ 2025 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) నేరుగా క్వాలిఫయర్ 1 కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. మంగళవారం ఎల్ఎస్జీతో జరిగిన మ్యాచ్‌లో ఘన విజయంతో ఆర్సీబీ ఈ ఘనత సాధించింది. ఈ మ్యాచ్‌ లో విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మ్యాచ్ అనంతరం విరాట్, అనుష్కల మధ్య చోటు చేసుకున్న ఓ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

లక్నోలోని ఏకానా స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ ఆరు వికెట్ల తేడాతో లక్నో జట్టును ఓడించింది. మ్యాచ్ ముగిసిన తర్వాత, విరాట్ కోహ్లీ మైదానం నుంచి పెవిలియన్‌కు వెళ్తుండగా, స్టాండ్స్‌లో ఉన్న అనుష్క శర్మను చూసి ఫ్లయింగ్ కిస్ ఇచ్చారు. అనుష్క కూడా అంతే ప్రేమగా విరాట్‌కు ఫ్లయింగ్ కిస్ తిరిగి ఇచ్చారు. ఈ అందమైన దృశ్యం కెమెరాల్లో రికార్డయింది. కొద్ది సేపటికే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అభిమానులు "రియల్ లవర్ బాయ్! విరుష్క" అంటూ కామెంట్లతో ఈ జంటపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
Virat Kohli
Anushka Sharma
RCB
Royal Challengers Bangalore
IPL 2024
LSG
Lucknow Super Giants
Flying Kiss
Virushka
Cricket

More Telugu News