Mirai Movie: ఆక‌ట్టుకుంటున్న 'మిరాయ్' టీజ‌ర్

Mirai Movie Teaser Released Starring Teja Sajja and Manchu Manoj
  • కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తేజ సజ్జ, మంచు మనోజ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో ‘మిరాయ్’
  • విజువల్ వండ‌ర్‌గా మిరాయ్ టీజ‌ర్
  • సెప్టెంబ‌ర్ 5న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న సినిమా
కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తేజ సజ్జ, మంచు మనోజ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘మిరాయ్’. తాజాగా ఈ చిత్రం టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. 'జరగబోయేది మారణహోమం… శిధిలం కాబోతుంది అశోకుడి ఆశయం' అంటూ మొదలైన టీజర్ ఆసక్తిగా సాగింది. నాలుగు పుస్తకాలు, వంద ప్రశ్నలు, ఒక కర్ర అంటూ తేజ సజ్జ చెప్పిన డైలాగ్‌ ఆకట్టుకుంది. మంచుకొండల్లో పెద్ద పక్షి నుంచి తప్పించుకుంటూ వెళ్లడం, రైలుపై నుంచి పరుగులు పెడుతూ చేసే సాహస సన్నివేశాలు బాగున్నాయి. విజువల్ ఎఫెక్ట్స్‌ మూవీపై అంచనాలు పెంచాయి. 

మొత్తంగా ఈ టీజర్ మాత్రం ఊహించని రీతిలో ఉందని చెప్పాలి. ఒక్క మాటలో చెప్పాలంటే మరో ప్రపంచంలోకి తీసుకెళ్లేలా ఉన్నారని చెప్పవచ్చు. అలాగే పాన్ ఇండియా లెవెల్లో దుమ్ము లేపేలా ఈ టీజర్ కనిపిస్తుంది. నెగిటివ్ షేడ్ లో మంచు మనోజ్ ఆశ్చర్యపరిస్తే, తేజ సజ్జ హను మాన్ తర్వాత మరోసారి మంచి సినిమా ఎంచుకున్న‌ట్లు క‌నిపిస్తోంది. ఈ విజువల్ వండ‌ర్ సెప్టెంబ‌ర్ 5న విడుద‌ల కానుంది. 

Mirai Movie
Teja Sajja
Manchu Manoj
Karthik Ghattamaneni
Mirai Teaser
Telugu Movie
Pan India Movie
Visual Effects
Ashoka
September 5 Release

More Telugu News