Harish Rao: కేసీఆర్ తో మరోసారి భేటీ అయిన హరీశ్ రావు

Harish Rao Meets KCR Again to Discuss Kaleshwaram Project Allegations
  • కేసీఆర్, హరీశ్ లకు కాళేశ్వరం నోటీసులు
  • పీసీ ఘోష్ కమిషన్ నోటీసులపై చర్చించిన నేతలు
  • విచారణకు వెళ్లాలా? న్యాయ పోరాటం చేయాలా? అనే దానిపై సమాలోచనలు
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో ఆ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు మరోసారి సమావేశమయ్యారు. ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ లో జరిగిన ఈ సమావేశంలో ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన ఆరోపణలపై జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్ జారీ చేసిన నోటీసుల గురించి చర్చించినట్లు సమాచారం.

కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్, ఈ నెల 20న కేసీఆర్, హరీశ్ రావులతో పాటు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌కు కూడా నోటీసులు పంపింది. పదిహేను రోజుల్లోగా కమిషన్ ముందు హాజరు కావాలని ఆ నోటీసుల్లో ఆదేశించింది. ఈ నేపథ్యంలో, మే 22న హరీశ్ రావు, కేసీఆర్‌తో సుమారు మూడున్నర గంటల పాటు చర్చలు జరిపారు. ఈ నోటీసుల వల్ల తలెత్తే రాజకీయ, చట్టపరమైన పరిణామాలపై వారు కూలంకషంగా చర్చించినట్లు తెలుస్తోంది.

కమిషన్ ముందు హాజరు కావాలా లేక చట్టపరమైన చర్యలు తీసుకోవాలా అనే అంశంపై వారు సమాలోచనలు జరిపినట్లు బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. 
Harish Rao
KCR
Kaleshwaram Project
Telangana
Justice Pinaki Chandra Ghose Commission
BRS Party
Etela Rajender
Corruption Allegations
Political Strategy
Eravalli Farmhouse

More Telugu News