Kannappa: 'కన్నప్ప' నుంచి శ్రీకాళహస్తి లిరికల్ వీడియో సాంగ్ విడుదల

- మంచు విష్ణు, ముఖేశ్ కుమార్ సింగ్ కాంబినేషన్‌లో 'కన్నప్ప'
- శ్రీకాళహస్తి స్థలపురాణాన్ని వివరించే లిరికల్ వీడియో సాంగ్ విడుదల చేసిన మేకర్స్
- ఈ సాంగ్‌లో కనిపించిన విష్ణు కూతుళ్లు అరియానా, వివియానా
మంచు విష్ణు ప్రధాన పాత్రలో బాలీవుడ్ డైరెక్టర్ ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం 'కన్నప్ప'. ఈ మూవీ జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన మూవీ పోస్టర్లు, పాటలు, టీజర్లు, ట్రైలర్ కన్నప్పపై భారీ అంచనాలు నెలకొల్పాయి. ఇక, ఈ మూవీ ద్వారా మోహన్ బాబు మనవరాళ్లు, విష్ణు కూతుళ్లు అరియానా, వివియానా కూడా తెరంగేట్రం చేస్తున్న విషయం తెలిసిందే.
ఇప్పటికే వారి తాలూకు పోస్టర్లను మేకర్స్ విడుదల చేశారు. ఇక, ఈ చిత్రంలో భాగంగా ఈ సోదరిమణులు శ్రీకాళహస్తి స్థలపురాణాన్ని వివరించే లిరికల్ వీడియోను తాజాగా చిత్రబృందం విడుదల చేసింది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఈ పాటను రిలీజ్ చేశారు.
కాగా, ఈ చిత్రంలో రెబల్ స్టార్ ప్రభాస్ అతిథి పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. అలాగే మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్, కాజల్ అగర్వాల్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.