Stock Market: ఈరోజు కూడా పతనమైన స్టాక్ మార్కెట్లు

Sensex Down 239 Points
  • 239 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 73 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
  • డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 85.37
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు కూడా నష్టాల బాటలోనే నడిచాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందుతున్నప్పటికీ, దేశీయంగా బ్లాక్ డీల్స్ మరియు ప్రైమరీ మార్కెట్లో పెరిగిన కార్యకలాపాల కారణంగా నిధులు తరలిపోవడంతో సూచీలు పతనమయ్యాయి. రోజంతా కొంతమేర ఒడిడుడుకులకు లోనైన మార్కెట్లు చివరికి నష్టాల్లోనే ముగిశాయి. ముఖ్యంగా ఎఫ్‌ఎంసీజీ రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.

సెన్సెక్స్ 239 పాయింట్ల నష్టంతో 81,312 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 73 పాయింట్లు కోల్పోయి 24,752 పాయింట్ల వద్ద స్థిరపడింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 85.37 వద్ద ఉంది.

సెన్సెక్స్ 30 సూచీలోని షేర్లలో ఐటీసీ, ఇండస్‌ఇండ్ బ్యాంక్, నెస్లే ఇండియా, అల్ట్రాటెక్ సిమెంట్, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు ప్రధానంగా నష్టపోయిన వాటిలో ఉన్నాయి. మరోవైపు బజాజ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్‌టెల్, ఐసీఐసీఐ బ్యాంక్, అదానీ పోర్ట్స్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేర్లు లాభాలను ఆర్జించాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 64.61 డాలర్ల వద్ద కొనసాగుతుండగా, బంగారం ఔన్సు ధర 3,317 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.
Stock Market
Sensex
Nifty
Indian Stock Market
Share Market
ITC
IndusInd Bank
FMCG
Rupee vs Dollar

More Telugu News