Nara Lokesh: మహానాడు వేదికపై నారా లోకేశ్ ను అభినందించిన చంద్రబాబు

Chandrababu Applauds Nara Lokesh at Mahanadu
  • మహానాడు వేదికపై 'ది వాయిస్ ఆఫ్ పీపుల్' పుస్తకావిష్కరణ
  • యువగళం పాదయాత్ర అనుభవాలతో నారా లోకేశ్ రచన
  • సీఎం చంద్రబాబుకు పుస్తకం తొలి ప్రతిని అందించిన లోకేశ్
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ తన యువగళం పాదయాత్ర అనుభవాలతో 'ది వాయిస్ ఆఫ్ పీపుల్' పేరుతో రూపందించిన కాఫీ టేబుల్ బుక్ ను మహానాడు వేదికపై ఆవిష్కరించారు. ఈ పుస్తకం తొలి ప్రతిని ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేశారు.

పుస్తకాన్ని ఆసక్తిగా పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, యువనేత లోకేశ్ ను అభినందించారు. యువగళం పాదయాత్ర ద్వారా రాష్ట్ర ప్రజలలో చైతన్యం తీసుకువచ్చారని, ఆనాటి అనుభవాలను పుస్తక రూపంలో భద్రపరచడం మంచి పరిణామమని ఆయన ప్రశంసించారు.

2023 జనవరి 27న కుప్పంలోని శ్రీ వరదరాజస్వామి ఆలయం నుంచి నారా లోకేశ్ యువగళం పాదయాత్రను ప్రారంభించారు. మొత్తం 226 రోజుల పాటు సాగిన ఈ యాత్ర, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కీలక మలుపు తిప్పిందని పలువురు విశ్లేషించారు. రాష్ట్రంలోని 11 ఉమ్మడి జిల్లాల్లో, 97 శాసనసభ నియోజకవర్గాలు, 232 మండలాలు/మున్సిపాలిటీలు, 2,097 గ్రామాల మీదుగా లోకేశ్ 3,132 కిలోమీటర్లు నడిచారు.




Nara Lokesh
Yuva Galam Padayatra
Chandrababu Naidu
Mahanadu
Telugu Desam Party
TDP
Voice of People
Andhra Pradesh Politics
AP Politics
Coffee Table Book

More Telugu News