Director Vamsi: నా సినిమాలో 'లాంతర్లు' కనిపించడానికి కారణం అదే: వంశీ

Vamsi Interview
  • ఒకప్పుడు దర్శకుడిగా వంశీ ఒక మార్క్
  • ఆయన సినిమాలలో గోదావరికి ప్రత్యేక స్థానం 
  • ఆయన సినిమా పాటలలో లాంతర్ల ఆకర్షణ
  • వంశీ ఇంట్లోనూ కనిపించే లాంతర్లు  
     
తెలుగు తెరపై గమ్మత్తయిన ప్రయోగాలు చేసిన దర్శకుడిగా వంశీ కనిపిస్తారు. ఆయన కథలు ఎక్కువగా విలేజ్ నేపథ్యంలో నడుస్తాయి. పసందైన పాటలు కూడా అక్కడి లొకేషన్స్ లోనే సరిపెట్టుకుంటాయి. ఆయన సినిమాల్లోని కథాకథనాలు కమ్మని పాటలను తోడుగా చేసుకుని పరిగెడుతూ ఉంటాయి. ప్రతి సన్నివేశంలోనూ .. ప్రతి ఫ్రేమ్ లోను వంశీ మార్క్ కనిపిస్తూ ఉంటుంది. 

వంశీ సినిమాలలో గోదావరి జిల్లాలు .. గోదావరి నది మలుపులు తప్పకుండా కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఆయన సినిమాలలో 'లాంతర్లు' కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఆయన సినిమాల్లోని పాటల్లో అక్కడక్కడా లాంతర్లు వెలుగులు చిమ్ముతూ ఆకట్టుకుంటూ ఉంటాయి. వీటికి  సంబంధించిన ప్రశ్న ఆయనకి జర్నలిస్ట్ ప్రేమ ఇంటర్వ్యూలో ఎదురైంది. అందుకు ఆయన తనదైన శైలిలో సమాధానమిచ్చారు. 

"నాకు పాతకాలం నాటి రైల్వే సిగ్నల్ లాంప్స్ .. లాంతర్లు అంటే ఎంతో ఇష్టం. అందువల్లనే నా ఫ్రెండ్స్ నాకు వాటిని గిఫ్ట్ గా ఇస్తూ ఉంటారు. నా చిన్నప్పుడు మా విలేజ్ లో అక్కడక్కడ మాత్రమే లైట్స్ ఉండేవి. అందువలన రాత్రుళ్లు ఎక్కడికి వెళ్లినా లాంతరు పుచ్చుకు వెళ్లేవాడిని. వాటి పట్ల నాకు గల ఇష్టం కారణంగానే సినిమాల్లో చూపిస్తూ వచ్చాను .. నా ఇంట్లోను వాటిని పెట్టుకుంటూ ఉంటాను" అని అన్నారు. 

Director Vamsi
Godavari Songs
Tolly Wood

More Telugu News