Deepika Padukone: 'స్పిరిట్' సినిమా వివాదం... దీపికకు తమన్నా మద్దతు?

Deepika Padukone Gets Tamannaahs Support in Spirit Movie Controversy
  • సందీప్ రెడ్డి వంగా 'స్పిరిట్' నుంచి దీపిక ఔట్ అంటూ వార్తలు
  • పనివేళలు, అదనపు పారితోషికంపై దీపిక డిమాండ్లే కారణమని ప్రచారం
  • మహిళల సమస్యలపై ఉన్న రీల్‌కు తమన్నా లైక్, దీపికకు పరోక్ష మద్దతు!
  • గతంలో ఆర్థిక స్వాతంత్ర్యంపై దీపిక చేసిన వ్యాఖ్యలున్న వీడియోకు తమన్నా ఆమోదం!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కనున్న చిత్రం 'స్పిరిట్' చుట్టూ వివాదాలు రాజుకుంటున్నాయి. బాలీవుడ్ అగ్రతార దీపికా పదుకొణె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారన్న వార్తలు సినీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. పనివేళలు, అదనపు పారితోషికం విషయంలో ఆమె పెట్టిన కఠిన డిమాండ్లే ఇందుకు కారణమని బలంగా ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలో, మరో నటి తమన్నా సోషల్ మీడియాలో చేసిన ఓ 'లైక్' దీపికాకు పరోక్షంగా మద్దతు పలుకుతున్నట్లుగా ఉండటం కొత్త చర్చకు దారితీసింది.

'స్పిరిట్' చిత్రం కోసం దీపికా రోజుకు ఆరు గంటలే పనిచేస్తానని, అదనపు రోజులకు అధిక పారితోషికం చెల్లించాలని డిమాండ్ చేసినట్లు బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. భారీ బడ్జెట్ చిత్రాలకు ఇలాంటి షరతులు ఆచరణ సాధ్యం కావని, నిర్మాతలకు భారంగా మారతాయని చిత్ర యూనిట్ భావించినట్లు తెలుస్తోంది. ఈ అసంతృప్తే దీపిక వైదొలగడానికి కారణమైందని బాలీవుడ్ వర్గాలు కోడై కూస్తున్నాయి.

ఈ వివాదం నడుస్తుండగానే, నటి తమన్నా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ రీల్‌ను లైక్ చేయడం ఆసక్తి రేపింది. మహిళలు వృత్తి జీవితంలో ఎదుర్కొనే లింగ వివక్ష, వేతన వ్యత్యాసాలు, అధిక పనిగంటల ఒత్తిడి వంటి అంశాలను ప్రస్తావించిన ఆ రీల్‌లో, గతంలో దీపికా తన ఆర్థిక స్వాతంత్ర్యం గురించి మాట్లాడిన వీడియో క్లిప్ కూడా ఉంది. "ఆమె అగౌరవానికి, లైంగిక వివక్షకు తలొగ్గదు" అనే వ్యాఖ్య ఆ రీల్‌కు జతచేసి ఉంది. దీపిక ఎదుర్కొంటున్న ఆరోపణల నేపథ్యంలో, ఈ రీల్‌కు తమన్నా లైక్ చేయడం పరోక్ష మద్దతేనని విశ్లేషకులు భావిస్తున్నారు.

సందీప్ వంగా పరోక్ష వ్యాఖ్యలు.. లీకుల కలకలం!

మరోవైపు, ఈ వివాదంపై దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కూడా పరోక్షంగా స్పందించారు. 'స్పిరిట్' సినిమా కథ, ఇతర వివరాలపై ప్రముఖ ఆంగ్ల సినీ వెబ్‌సైట్ 'పింక్‌విల్లా'లో ఒక కథనం ప్రచురితమైంది. దీనిపై సందీప్ వంగా తన ఎక్స్ ఖాతాలో స్పందిస్తూ, "ఆ వార్త రాసిన వ్యక్తి నా ఆఫీస్‌లో నా పక్కనే కూర్చుని కథ విన్నట్లున్నాడు. అంత వివరంగా రాశాడు" అంటూ వ్యంగ్యంగా పోస్ట్ చేశారు. ఈ లీకుల వెనుక దీపికా పదుకొణె హస్తం ఉండి ఉండొచ్చని ఆయన పరోక్షంగా ఆరోపిస్తున్నట్లు కొందరు భావిస్తున్నారు. సినిమా నుంచి తప్పుకున్న తర్వాత, ప్రాజెక్ట్‌కు నష్టం కలిగించేందుకే ఇలాంటి లీకులు ఇస్తున్నారనే కోణంలో కూడా చర్చ జరుగుతోంది. అంతేకాకుండా, 'స్పిరిట్'లో మరో హీరోయిన్‌గా ప్రచారంలో ఉన్న త్రిప్తి దిమ్రి పాత్ర గురించి కూడా కొన్ని ఊహాగానాలు వస్తున్నాయి. ఆమె పాత్ర సినిమాలో "హద్దులు దాటుతుందని" వస్తున్న కథనాలపై కూడా సందీప్ వంగా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
Deepika Padukone
Prabhas Spirit movie
Sandeep Reddy Vanga
Tamannaah Bhatia
Bollywood actress
Spirit movie controversy
Gender discrimination
Pay disparity
Tripti Dimri
Tollywood news

More Telugu News