Pullanna: వివాహేతర సంబంధం: ప్రియుడి ఆత్మహత్యాయత్నం... మహిళ ఆత్మహత్య

Extra Marital Affair Woman Commits Suicide Lover Attempts Suicide
  • రాజోలిలో వివాహేతర సంబంధం విషాదాంతం
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రియుడు
  • మహిళ ఆత్మహత్య,
  • గ్రామం విడిచి వెళ్లి తిరిగొచ్చిన జంట
  • కుటుంబ కలహాలతో తీవ్ర నిర్ణయాలు
  • కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
వివాహేతర సంబంధం విషాదం నింపింది. ఈ ఘటనలో ప్రియుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా... మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన జోగులాంబ గద్వాల్ జిల్లా రాజోలి మండల కేంద్రంలో కలకలం రేపింది. ఈ విషాదకర సంఘటనకు సంబంధించిన వివరాలను స్థానిక ఎస్సై జగదీశ్వర్ వెల్లడించారు.

రాజోలి గ్రామానికి చెందిన 32 ఏళ్ల మహిళకు వివాహమై భర్త, ఒక కుమార్తె ఉన్నారు. అదే గ్రామానికి చెందిన పుల్లన్న అనే వ్యక్తి స్థానిక పంచాయతీ కార్యాలయంలో కాంట్రాక్టు పద్ధతిపై విధులు నిర్వహిస్తున్నాడు. కొంతకాలంగా ఆ మహిళకు, పుల్లన్నకు మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఈ క్రమంలో ఈ నెల 12న ఇద్దరూ కలిసి గ్రామం విడిచి వెళ్లిపోయారు. ఈ ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో మహిళ అదృశ్యమైనట్లు కేసు నమోదైంది.

అయితే, కుమార్తెను చూడాలనే కోరికతో ఆ మహిళ ఈ నెల 25న గ్రామానికి తిరిగి వచ్చింది. పోలీసుల విచారణలో తాను పుల్లన్నతో ఇష్టపూర్వకంగానే వెళ్లినట్లు వాంగ్మూలం ఇచ్చింది. దీంతో పోలీసులు ఇరువురికీ నచ్చజెప్పి వారి వారి ఇళ్లకు పంపించారు. ఈ పరిణామాల నేపథ్యంలో రెండు కుటుంబాల మధ్య గొడవలు జరిగాయి.

దీంతో మనస్తాపానికి గురైన పుల్లన్న సోమవారం (మే 27న) ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతడిని కర్నూలులోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఒకవైపు ప్రియుడు ఆత్మహత్యాయత్నం చేయడం, మరోవైపు తన కారణంగా భర్త కుమిలిపోతుండటంతో ఆ మహిళ ఆవేదనకు గురైంది. ఈ క్రమంలో సోమవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్సై జగదీశ్వర్ తెలిపారు. ఈ సంఘటన గ్రామంలో విషాదం నింపింది.
Pullanna
Extra marital affair
Jogulamba Gadwal
Woman suicide
Suicide attempt
Rajoli

More Telugu News