Himanta Biswa Sarma: అసోంలో స్థానికుల ఆత్మరక్షణకు ప్రభుత్వం అండ.. ముప్పున్న ప్రాంతాల్లో ఆయుధ లైసెన్సులు!

Himanta Biswa Sarma Government Supports Self Defense with Arms Licenses in Assam
  • అసోంలో స్థానికుల రక్షణకు ప్రభుత్వ కీలక నిర్ణయం
  • ముప్పున్న, మారుమూల ప్రాంతాల వారికి ఆయుధ లైసెన్సులు
  • ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ వెల్లడి
స్థానిక ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని అసోం ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని కొన్ని మారుమూల, సమస్యాత్మక ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలకు స్వీయ రక్షణ నిమిత్తం ఆయుధ లైసెన్సులు మంజూరు చేయాలని నిశ్చయించింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్వయంగా వెల్లడించారు.

ముప్పు పొంచివున్న, మారుమూల ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల నుంచి చాలాకాలంగా వస్తున్న విజ్ఞప్తులను క్షుణ్ణంగా సమీక్షించిన మీదట రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయానికి ఆమోదముద్ర వేసినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. "అసోం చాలా వైవిధ్యభరితమైన, సున్నితమైన రాష్ట్రం. ఇక్కడి కొన్ని ప్రాంతాల్లో నివసిస్తున్న అసోం ప్రజలు తీవ్ర అభద్రతా భావంతో జీవిస్తున్నారు. తమకు ఆయుధ లైసెన్సులు ఇవ్వాలని వారు ఎప్పటినుంచో కోరుతున్నారు" అని సీఎం వివరించారు.

ముఖ్యంగా, రాష్ట్రంలోని ముప్పు అధికంగా ఉన్న, మారుమూల ప్రాంతాల్లో నివసిస్తూ, అర్హత కలిగిన స్థానికులకు లైసెన్సులు జారీ చేసే విషయంలో ప్రభుత్వం ఉదారంగా వ్యవహరిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కేటగిరీ కిందకు ధుబ్రి, మోరిగావ్‌, బార్‌పేట, నాగావ్‌, దక్షిణ సల్మారా-మాంకాచార్‌ వంటి ప్రాంతాలు వస్తాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. "ఈ ప్రాంతాలలో మా ప్రజలు సంఖ్యాపరంగా మైనార్టీలుగా ఉన్నారు" అని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.
Himanta Biswa Sarma
Assam
Arms licenses
Self-defense
Minority communities

More Telugu News