South Central Railway: మరో 44 స్పెషల్ రైళ్లు ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే

South Central Railway Announces 44 Special Trains
  • జూన్ 1 నుంచి వీక్లీ స్పెషల్ రైళ్లను ఏర్పాటు చేసిన దక్షిణ మధ్య రైల్వే 
  • ప్రయాణికులు రద్దీ దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడి 
దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త తెలిపింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాలకు వీక్లీ స్పెషల్ రైళ్లను నడిపేందుకు చర్యలు తీసుకుంది. మొత్తం 44 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది.

విశాఖపట్నం నుండి బెంగళూరు (08581) మధ్య జూన్ 1 నుండి 29వ తేదీ వరకు ప్రతి ఆదివారం రైలు రాకపోకలు సాగిస్తుందని తెలిపింది. అదే విధంగా జూన్ 2 నుండి 30 వరకు ప్రతి సోమవారం బెంగళూరు నుండి విశాఖపట్నం (08582) మధ్య రైలు నడుస్తుందని వెల్లడించింది.

విశాఖపట్నం నుండి తిరుపతి (08547) మధ్య రైలు జూన్ 4 నుండి జులై 30 వరకు ప్రతి బుధవారం, తిరుపతి నుండి విశాఖపట్నం (08548) మధ్య రైలు జూన్ 5 నుండి జులై 31 వరకు ప్రతి గురువారం, విశాఖపట్నం నుండి చర్లపల్లి (08559) మధ్య రైలు జూన్ 6 నుండి జులై 27 వరకు ప్రతి శుక్రవారం, చర్లపల్లి నుండి విశాఖపట్నం (08580) మధ్య రైలు జూన్ 7 నుండి జులై 26 వరకు ప్రతి శనివారం నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ప్రయాణికులు ఈ రైళ్ల సేవలను వినియోగించుకోవాలని కోరింది. 
South Central Railway
SCR
Special Trains
Indian Railways
Visakhapatnam
Bengaluru
Tirupati
Charlapalli
Weekly Trains
Train Services

More Telugu News