Digital Pin Code: ఇక మీదట చిరునామాలకు డిజిటల్ పిన్ కోడ్ లు!

Digital Pin Codes for Addresses in India
  • కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో చిరునామాలకు ప్రత్యేక ఐడీ  
  • ప్రజల సంప్రదింపులకు త్వరలో ముసాయిదా పాలసీ 
  • పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కొత్త బిల్లును ప్రవేశపెట్టే ఛాన్స్  
దేశంలోని ప్రతి పౌరుడికి ప్రత్యేకమైన అధికార గుర్తింపు ఆధార్ ఉన్నట్లే, ప్రతి చిరునామాకు ఒక ప్రత్యేకమైన డిజిటల్ ఐడీని తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇళ్లు, స్థలాలను మరింత కచ్చితత్వంతో, వేగంగా గుర్తించేందుకు ఈ ప్రత్యేక ఐడీ ఉపయోగపడుతుంది. దీని వల్ల డోర్ డెలివరీ సేవలు మరింత సజావుగా అందించడానికి దోహదపడుతుంది.

ప్రస్తుతం దేశంలో చిరునామా డేటా నిర్వహణకు సంబంధించి ఎటువంటి ప్రామాణిక వ్యవస్థ లేదు. దీంతో కొన్ని ప్రైవేటు సంస్థలు వ్యక్తుల అనుమతి లేకుండా వారి చిరునామా సమాచారాన్ని సేకరించి దుర్వినియోగం చేస్తున్నాయి. దీన్ని అరికట్టేందుకు దేశ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ) వ్యవస్థకు భౌతిక చిరునామాలను కూడా జోడించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది.

ప్రధాన మంత్రి కార్యాలయం పర్యవేక్షణలో తపాలా శాఖ ఈ ప్రాజెక్టును అత్యంత పకడ్బందీగా నిర్వహిస్తోంది. ముసాయిదా పాలసీని త్వరలోనే ప్రజల సంప్రదింపుల కోసం విడుదల చేయనున్నారు. ఈ ఏడాది చివరికల్లా కొత్త వ్యవస్థ తుది రూపు దాల్చే అవకాశం ఉంది. ఈ డిజిటల్ అడ్రస్ ఫ్రేమ్‌వర్క్‌ను పర్యవేక్షించడానికి అధికారికంగా ఒక అథారిటీని ఏర్పాటు చేయడానికి పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కొత్త బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

డిజిపిన్ (డిజిటల్ పోస్టల్ ఇండెక్స్ నంబర్) కచ్చితమైన మ్యాప్ కోఆర్డినేటర్ల ఆధారంగా ప్రతి చిరునామాకు విశిష్టమైన పది అంకెల ఆల్ఫాన్యూమరిక్ కోడ్ ఇస్తారు. పెద్ద ప్రాంతాలను కవర్ చేసే సాంప్రదాయ పిన్ కోడ్ మాదిరిగా కాకుండా డిజిపిన్‌లు వ్యక్తిగత గృహాలు లేదా వ్యాపార సంస్థలకు స్పష్టమైన కచ్చితత్వాన్ని అందిస్తాయి. 
Digital Pin Code
India address system
Digital Postal Index Number
DPI
address data
postal service
digital address
Aadhar
digital public infrastructure

More Telugu News