YS Jagan Mohan Reddy: మానవత్వం చాటుకున్న జగన్... రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ మహిళను పలకరించిన వైనం

Jagan Mohan Reddy Helps Road Accident Victim in Tadepalli
  • తాడేపల్లి వారధి వద్ద రోడ్డు ప్రమాదం, వృద్ధురాలికి తీవ్ర గాయాలు
  • మాజీ సీఎం జగన్ మానవతా దృక్పథంతో స్పందన
  • బాధితురాలికి తక్షణ వైద్యం అందించాలని ఎమ్మెల్సీ అరుణ్‌ కుమార్‌కు ఆదేశం
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. తాడేపల్లి సమీపంలోని వారధి వద్ద ఒక వృద్ధురాలు బస్సు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఆమె రెండు కాళ్లకూ దెబ్బలు తగిలాయి. విజయవాడలోని శిశువిహార్‌ నుంచి తాడేపల్లికి తిరిగి వస్తున్న జగన్‌ ఈ ఘటనను గమనించి, వెంటనే స్పందించారు. వాహనం దిగి బాధిత మహిళతో మాట్లాడారు. 

బాధితురాలిని తక్షణమే ఆసుపత్రిలో చేర్పించి, అవసరమైన వైద్య సహాయం అందించే బాధ్యతను ఎమ్మెల్సీ అరుణ్‌ కుమార్‌కు ఆయన అప్పగించారు. ఆయన వెంటనే అటుగా వెళుతున్న ఒక ప్రైవేట్‌ అంబులెన్స్‌ను ఆపి, దానిలో వృద్ధురాలిని విజయవాడ ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రికి తరలించారు. బాధితురాలికి వైద్య సేవలు అందేవరకు ఎమ్మెల్సీ అరుణ్‌ కుమార్‌ అక్కడే ఉండి పర్యవేక్షించారు. ఈ ఘటనతో జగన్మోహన్ రెడ్డి చూపిన చొరవ, మానవత్వం పట్ల పలువురు ప్రశంసలు వ్యక్తం చేస్తున్నారు. 
YS Jagan Mohan Reddy
Jagan
Tadepalli
Road Accident
Woman Injured
YSRCP
Arun Kumar MLC
Vijayawada GGH
Andhra Pradesh
Bus Accident

More Telugu News