RCB: ఈ సెంటిమెంట్ వ‌ర్క‌వుట్ అయితే ఆర్‌సీబీదే ఈసారి టైటిల్!

RCB Title Hopes Rise with Playoff Sentiment
  • ఇవాళ క్వాలిఫ‌య‌ర్-1లో త‌ల‌ప‌డ‌నున్న‌ పంజాబ్, బెంగ‌ళూరు
  • లీగ్ ద‌శ‌లో రెండో స్థానంలో నిలిచిన ఆర్‌సీబీ విష‌యమై ఓ క్రేజీ న్యూస్‌ వైర‌ల్‌
  • 2011 నుంచి సెకండ్ పొజిష‌న్‌లో ఉన్న జ‌ట్టే ఏకంగా 8 సార్లు విజేత‌
  • ఇదే సెంటిమెంట్ వ‌ర్క‌వుట్ అయితే ఆర్‌సీబీకి తొలి టైటిల్ ఖాయ‌మ‌ని ఫ్యాన్స్‌ కామెంట్స్
మ‌రికొన్ని గంటల్లో ఐపీఎల్ ప్లేఆఫ్స్‌కు తెర‌లేవ‌నుంది. ఈరోజు ముల్లాన్‌పూర్ వేదిక‌గా క్వాలిఫ‌య‌ర్-1లో పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్‌), రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (ఆర్‌సీబీ) త‌ల‌ప‌డ‌నున్నాయి. ఇందులో గెలిచిన జ‌ట్టు నేరుగా ఫైన‌ల్‌కి వెళుతుంది. ఓడిన జ‌ట్టు... క్వాలిఫ‌య‌ర్‌-2లో ఎలిమినేట‌ర్‌ మ్యాచ్ విజేత‌తో ఆడ‌నుంది. 

ఇదిలాఉంటే... లీగ్ ద‌శ‌లో పాయింట్ల ప‌ట్టిక‌లో రెండో స్థానంలో నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగ‌ళూరు విష‌య‌మై ఓ క్రేజీ న్యూస్ వైర‌ల్ అవుతోంది. 2011 నుంచి లీగ్ స్టేజీలో సెకండ్ పొజిష‌న్‌లో ఉన్న జ‌ట్టే ఏకంగా ఎనిమిది సార్లు విజేత‌గా అవ‌త‌రించింది. గ‌త 13 సీజ‌న్ల‌లో రెండో స్థానంలో ఉన్న టీమ్ లు ఎనిమిదిసార్లు టైటిళ్లు సాధించాయన్న‌మాట‌. 

దీంతో ఇదే సెంటిమెంట్ వ‌ర్క‌వుట్ అయితే ఆర్‌సీబీకి తొలి టైటిల్ ద‌క్క‌డం ఖాయ‌మ‌ని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. 

ఇక‌, మొద‌టి స్థానంలో నిలిచిన జ‌ట్టు ఐదుసార్లు టైటిల్ గెలిస్తే... మూడో ప్లేస్‌లో నిలిచిన టీమ్ ఒక్క‌సారి మాత్ర‌మే విజేత‌గా ఉంది. నాలుగో స్థానంలో ఉన్న జ‌ట్టు ఇప్ప‌టివ‌ర‌కు టైటిల్ గెల‌వ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. 

మ‌రి ఈసారి ప్లేఆఫ్స్‌కు చేరిన పంజాబ్ కింగ్స్‌, రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, గుజ‌రాత్ టైటాన్స్‌, ముంబ‌యి ఇండియ‌న్స్ జ‌ట్ల‌లో ఏది విజేత‌గా నిలుస్తుందో చూడాలి. వీటిలో ఇప్ప‌టివ‌ర‌కు ముంబ‌యి 5 సార్లు, గుజ‌రాత్ ఒక్క‌సారి టైటిల్ గెల‌వ‌గా.. పంజాబ్‌, బెంగ‌ళూరు మాత్రం ఇంకా ఖాతా తెర‌వ‌లేదు.  
RCB
Royal Challengers Bangalore
IPL Playoffs
IPL 2024
Punjab Kings
PBKS
Gujarat Titans
Mumbai Indians
IPL Title
Cricket

More Telugu News