Bandi Saroj Kumar: గద్దర్ అవార్డులు కమర్షియల్ హిట్ సినిమాలకే ఇస్తారా?: నటుడు బండి సరోజ్ కుమార్ అసంతృప్తి

Bandi Saroj Kumar Disappointed with Gaddar Awards Selection
  • తెలంగాణ ప్రభుత్వం గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రకటన
  • నటుడు బండి సరోజ్ కుమార్‌ తీవ్ర అసంతృప్తి 
  • గద్దర్ పేరు పెట్టి ఫేమస్ సినిమాలకే అవార్డులు ఇస్తున్నారని వ్యాఖ్య
  • ప్రముఖ చిత్రాలకే పురస్కారాలు ఇస్తున్నారని ఆరోపణ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గురువారం గద్దర్ ఫిల్మ్ అవార్డులను ప్రకటించింది. తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎఫ్‌డీసీ) ఛైర్మన్ దిల్‌రాజు, జ్యూరీ ఛైర్‌పర్సన్‌ జయసుధ సంయుక్తంగా ఈ పురస్కార వివరాలను ప్రకటించారు. ఈ అవార్డుల ప్రకటనపై నటుడు బండి సరోజ్ కుమార్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ సామాజిక మాధ్యమంలో ఒక పోస్టు చేశారు.

గద్దర్ అవార్డుల ఎంపిక తీరుపై బండి సరోజ్ కుమార్ స్పందిస్తూ, "అప్పట్లో నంది అవార్డ్స్ అనౌన్స్ చేశాక ఈ సినిమాలు ఎప్పుడొచ్చాయి? ఈ నటులు ఎవరు? అని వెతుక్కుని మరీ చూసేవాళ్ళం. ఇప్పుడు ఒక విప్లవ వీరుడు గద్దర్ పేరు పెట్టి ఫేమస్ చిత్రాలకే అవార్డులు ఇస్తున్నారు" అని తన అభిప్రాయాన్ని వెల్లడించారు. "ఇదంతా నేను ముందే ఊహించాను. అందుకే నా సినిమాను పంపలేదు. జాతీయ అవార్డుకు మాత్రమే పంపుదాం అనుకున్నాను. ఇప్పుడు అక్కడికి కూడా పంపను. కమర్షియల్ హిట్టు కొడితే.. అవార్డులు కూడా పరిగెత్తుకుంటూ వస్తాయి" అని ఆయన 'ఎక్స్‌' వేదికగా పేర్కొన్నారు.

భారతదేశం ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచిందన్న వార్తలు సంతోషాన్ని నింపుతున్నాయని, కానీ కళారంగంలో మన దేశం స్థానం ఏమిటనే దానిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయని ఆయన విచారం వ్యక్తం చేశారు.
Bandi Saroj Kumar
Gaddar Awards
Telangana Film Development Corporation
Dil Raju
Jayasudha

More Telugu News