Param Sundari: ఆస‌క్తిక‌రంగా జాన్వీ కపూర్ ‘పరమ్ సుందరి’ ఫ‌స్ట్ లుక్‌ టీజ‌ర్‌

Janhvi Kapoor Param Sundari First Look Teaser Released
  • జాన్వీ కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా జంట‌గా ‘పరమ్ సుందరి’
  • రొమాంటిక్ కామెడీ చిత్రంగా తెర‌కెక్కించిన తుషార్ జలోటా
  • జులై 25న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న సినిమా
జాన్వీ కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా హీరోహీరోయిన్లుగా తెర‌కెక్కిన‌ రొమాంటిక్ కామెడీ చిత్రం ‘పరమ్ సుందరి’. తాజాగా మేక‌ర్స్ ఈ మూవీ ఫ‌స్ట్ లుక్‌ టీజ‌ర్‌ను రిలీజ్‌ చేశారు. టీజ‌ర్ చూస్తుంటే ఈ చిత్రం ‘పరం’ (సిద్ధార్థ్ మల్హోత్రా), ‘సుందరి’ (జాన్వీ కపూర్) మధ్య ప్రేమకథగా సాగనుంద‌ని తెలుస్తోంది. వీరిద్దరి మధ్య సాంస్కృతిక భేదాలు, హాస్యభరితమైన సన్నివేశాలు సినిమాకు హైలైట్‌గా నిలవనున్నాయి. 

ఈ టీజర్‌లో కేరళలోని అందమైన బ్యాక్‌వాటర్స్, హౌస్‌బోట్‌ల నేపథ్యం అద్భుతంగా ఉంది. సిద్ధార్థ్, జాన్వీ ఒక బైక్‌పై రొమాన్స్ చేస్తూ కనిపించారు. బ్యాక్‌గ్రౌండ్‌లో సోను నిగమ్ ఆలపించిన మధురమైన పాట హైలైట్‌గా నిలిచింది. దినేశ్‌ విజన్ నిర్మిస్తున్న ఈ రొమాంటిక్ కామెడీ చిత్రాన్ని తుషార్ జలోటా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో రాజీవ్ ఖండేల్వాల్, ఆకాశ్‌ దహియా ఇత‌ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘పరమ్ సుందరి’ చిత్రం జులై 25న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. 



Param Sundari
Janhvi Kapoor
Sidharth Malhotra
Romantic comedy
Tushar Jalota
Dinesh Vijan
Bollywood movie
Sonu Nigam
Rajeev Khandelwal
Kerala

More Telugu News