PSR Anjaneyulu: జెత్వానీ కేసులో పీఎస్ఆర్ ఆంజనేయులుకు బెయిల్

- సీనియర్ ఐపీఎస్ అధికారికి షరతులతో కూడిన బెయిల్
- నటి కాదంబరీ జెత్వానీ వేధింపుల కేసుకు సంబంధించిన వ్యవహారం
- గత నెలలో పీఎస్ఆర్ ఆంజనేయులును సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన వైనం
ముంబైకి చెందిన సినీ నటి కాదంబరీ జెత్వానీని వేధించారన్న ఆరోపణలతో అరెస్టయిన సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులుకు ఊరట లభించింది. ఈ కేసులో ఆయనకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పలు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నటి కాదంబరీ జెత్వానీపై కక్షపూరితంగా తప్పుడు కేసు నమోదు చేయించి, చట్టవిరుద్ధంగా అరెస్టు చేసి, మానసికంగా వేధించారనేది ప్రధాన ఆరోపణ. ఈ వ్యవహారంలో పీఎస్ఆర్ ఆంజనేయులు రెండో నిందితుడిగా (ఏ2) ఉన్నారు. ఈ ఆరోపణల నేపథ్యంలో గత నెలలో రాష్ట్ర దర్యాప్తు సంస్థ (సీఐడీ) అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకుని విచారణ జరిపిన సంగతి తెలిసిందే.
విచారణ అనంతరం పీఎస్ఆర్ ఆంజనేయులు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఆయన అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న ఉన్నత న్యాయస్థానం, కొన్ని షరతులు విధిస్తూ బెయిల్ మంజూరు చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కేసు తదుపరి విచారణ కొనసాగనుంది.