Baba John: భార్యా పిల్లల కోసమే దొంగతనం.. నిందితుడి కథ విని షాకైన పోలీసులు!

Baba John Man Steals to Feed Three Wives Nine Children
  • ముగ్గురు భార్యలు, తొమ్మిది మంది పిల్లల కోసం దొంగతనాలు
  • బెంగళూరు వాసి బాబా జాన్ అరెస్ట్
  • విచారణలో వెలుగులోకి అసలు కారణం
  • బెంగళూరు, చిక్కబళ్లాపుర, శ్రీరంగ పట్టణాల్లో నిందితుడి కుటుంబాలు
  • 188 గ్రాముల బంగారం, 550 గ్రాముల వెండి స్వాధీనం 
ముగ్గురు భార్యలు, వారికి కలిగిన తొమ్మిది మంది పిల్లలతో కూడిన పెద్ద కుటుంబాన్ని పోషించడం తలకు మించిన భారంగా మారడంతో మరో మార్గం లేక ఓ వ్యక్తి చోరీల బాట పట్టాడు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా ఈ ఆసక్తికరమైన అంశం వెలుగులోకి వచ్చింది. బెంగళూరుకు చెందిన బాబా జాన్ (36) అనే వ్యక్తికి ముగ్గురు భార్యలు ఉన్నారు. వీరికి మొత్తం తొమ్మిది మంది సంతానం. ఈ మూడు కుటుంబాలను అతను బెంగళూరు, చిక్కబళ్లాపుర, శ్రీరంగ పట్టణాల్లో వేర్వేరుగా ఉంచి, తరచూ వారి వద్దకు వెళ్లి వస్తుండేవాడు. మొదట్లో కూలి పనులు చేస్తూ జీవనం సాగించే బాబా జాన్‌కు, ఇంత పెద్ద కుటుంబాన్ని పోషించడం రోజురోజుకూ కష్టంగా మారింది. సంపాదన సరిపోకపోవడంతో, సులభంగా డబ్బు సంపాదించే మార్గంగా దొంగతనాలను ఎంచుకున్నాడు.

కొంతకాలంగా వివిధ ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న బాబా జాన్‌ను ఎట్టకేలకు గురువారం ఎలక్ట్రానిక్‌ సిటీ పోలీసులు పట్టుకున్నారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా, తన నేరాలకు వెనుక ఉన్న కారణాన్ని వివరించాడు. ముగ్గురు భార్యలు, తొమ్మిది మంది పిల్లల పోషణ భారం కావడంతోనే ఈ దారి పట్టినట్లు అంగీకరించాడు. నిందితుడి నుంచి పోలీసులు 188 గ్రాముల బంగారం, 550 గ్రాముల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Baba John
Bangalore Crime
Theft Case
Multiple Wives
Family Poverty
Electronic City Police
Karnataka Crime
Crime News
Gold Seizure
Silver Seizure

More Telugu News