Punjab Firecracker Factory: పంజాబ్‌లోని బాణసంచా కర్మాగారంలో పేలుడు.. ఐదుగురి మృతి

Punjab Firecracker Factory Explosion Kills Five
  • అర్ధరాత్రి దాటాక భారీ పేలుడు
  • ఘటనా స్థలంలోనే ఐదుగురి మృత్యువాత
  • ప్రమాదానికి గల కారణాలపై పోలీసుల దర్యాప్తు
పంజాబ్‌లోని శ్రీ ముక్త్సార్ సాహిబ్ జిల్లా సింగేవాలా గ్రామంలోని బాణసంచా కర్మాగారంలో గత అర్ధరాత్రి జరిగిన భారీ పేలుడులో ఐదుగురు వలస కార్మికులు మరణించారు. మరో 29 మంది గాయపడ్డారు. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో జరిగిన ఈ పేలుడు ధాటికి కర్మాగారం పూర్తిగా కుప్పకూలింది. ఆ వెంటనే మంటలు అంటుకున్నాయి. అయితే, భవనం కూలడం వల్లే ప్రాణనష్టం సంభవించిందని పోలీసులు తెలిపారు. 

క్షతగాత్రులను బఠిండాలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్), ముక్త్సార్‌లోని ఆసుపత్రులకు తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న సహాయక బృందాలు శిథిలాలను తొలగిస్తున్నాయి. వాటికింద ఎవరైనా చిక్కుకుని ఉండొచ్చన్న అనుమానంతో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. ప్రమాదానికి గల కారణం తెలియరాలేదు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కర్మాగారం హర్యానా సరిహద్దుకు సమీపంలో ఉండటంతో అనుమతులు, భద్రతా ప్రమాణాలపై అధికారులు దృష్టి సారిస్తున్నారు. 
Punjab Firecracker Factory
Sri Muktsar Sahib
Firecracker Factory Explosion
Singhewala Village
Migrant Workers
Punjab Accident
India News
Fire Accident
Batinda AIIMS
Haryana Border

More Telugu News