Mahendra Vardhan: భోజనానికి పిలిచి అత్యాచారం చేశాడు... తర్వాత కోటి డిమాండ్ చేశాడు

Woman blackmailed after rape in Hyderabad
  • హైదరాబాద్ లో దారుణ ఘటన
  • ఫేస్ బుక్ ద్వారా యువతికి మహేంద్రవర్ధన్ అనే వ్యక్తి పరిచయం
  • పానీయంలో మత్తుమందు కలిపి అత్యాచారం
స్నేహం పేరుతో ఓ యువతిని కేటుగాడు దారుణంగా మోసం చేశాడు. ఈ ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... బంజారాహిల్స్ లో ఉంటున్న 24 ఏళ్ల యువతికి 2023 ఫిబ్రవరిలో ఫేస్ బుక్ ద్వారా మహేంద్రవర్ధన్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. తాను ఉస్మానియా యూనివర్శిటీలో పని చేస్తున్నట్టు చెప్పుకున్నాడు. ఇద్దరి మధ్య కొన్నాళ్ల పాటు ఫోన్ లో మాటలు నడిచాయి. ఒకరోజు కాఫీషాప్ కు రమ్మని పిలిస్తే ఆమె వెళ్లింది. 

ఆ తర్వాత అదే ఏడాది ఆగస్ట్ 15న తన ఇంటికి భోజనానికి పిలిచాడు. అతన్ని నమ్మి బాధితురాలు వెళ్లింది. ఇంటికొచ్చిన ఆమెను మాటల్లో పెట్టి మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చాడు. అది తాగిన బాధితురాలు మగతలోకి జారుకుంది. అనంతరం ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ దారుణాన్ని ఫొటోలు, వీడియోలు తీశాడు. మరుసటి రోజు ఆమెకు వీడియోలు, ఫొటోలు చూపించి రూ. 20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఇవ్వకపోతే వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించాడు. భయాందోళనకు గురైన బాధితురాలు రూ. 20 లక్షలు అతని చేతుల్లో పెట్టింది. అయితే కోటి రూపాయలు ఇవ్వాలంటూ గతకొన్నాళ్లుగా ఆమెను టార్చర్ పెడుతున్నాడు. దీంతో, ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Mahendra Vardhan
Hyderabad
Rape
Blackmail
Osmania University
Cyber Crime
Banjara Hills
Facebook Friend

More Telugu News