Gaddar: గద్దర్ అవార్డులు.. 2014 నుంచి 2023 వరకు ప్రకటించిన జ్యూరీ

Gaddar Awards Announced for Telangana Films 2014 To 2023
--
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం సినిమాలకు అవార్డులు అందించలేదని మురళీమోహన్ గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఉత్తమ సినిమాలకు అవార్డులు ఇవ్వాలని నిర్ణయించి, గద్దర్ పేరుతో అవార్డులు ఏర్పాటు చేయడం సంతోషకరమని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మురళీమోహన్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల జ్యూరీ కమిటీకి చైర్మన్ గా 2014 నుంచి 2023 వరకు ఏడాదికి ఒక ఉత్తమ చిత్రాన్ని ఎంపిక చేశామని జ్యూరీ సభ్యులు తెలిపారు. ఇందులో ప్రముఖ నిర్మాత దిల్ రాజు కూడా ఉన్నారు. 2024 ఏడాదికి సంబంధించిన అవార్డులను ఈ కమిటీ గురువారమే ప్రకటించగా.. మిగతా పదేళ్లకు సంబంధించిన అవార్డులను శుక్రవారం మధ్యాహ్నం ప్రకటించింది. 

ఉత్తమ చిత్రాలు ఇవే..

2014 ఏడాదికి 
ఉత్తమ చిత్రంగా రన్‌ రాజా రన్‌, 
రెండో ఉత్తమ చిత్రంగా పాఠశాల,
మూడో ఉత్తమ చిత్రంగా అల్లుడు శీను

2015 ఏడాదికి..
ఉత్తమ చిత్రం: రుద్రమదేవి, 
రెండో ఉత్తమ చిత్రంగా కంచె, 
మూడో ఉత్తమ చిత్రంగా శ్రీమంతుడు

2016: ఏడాదికి 
ఉత్తమ చిత్రంగా శతమానం భవతి, 
రెండో ఉత్తమ చిత్రంగా పెళ్లిచూపులు, 
మూడో ఉత్తమ చిత్రంగా జనతా గ్యారేజ్

2017: ఏడాదికి 
ఉత్తమ చిత్రంగా బాహుబలి కంక్లూజన్‌, 
రెండో ఉత్తమ చిత్రంగా ఫిదా, 
మూడో ఉత్తమ చిత్రంగా ఘాజీ

2018: ఏడాదికి 
ఉత్తమ చిత్రంగా మహానటి, 
రెండో ఉత్తమ చిత్రంగా రంగస్థలం, 
మూడో ఉత్తమ చిత్రంగా కేరాఫ్ కంచర్లపాలెం

2019: ఏడాదికి 
ఉత్తమ చిత్రంగా మహర్షి, 
రెండో ఉత్తమ చిత్రంగా జెర్సీ, 
మూడో ఉత్తమ చిత్రంగా మల్లేశం

2020: ఏడాదికి 
ఉత్తమ చిత్రంగా అల వైకుంఠపురంలో, 
రెండో ఉత్తమ చిత్రంగా కలర్ ఫొటో, 
మూడో ఉత్తమ చిత్రంగా మిడిల్ క్లాస్ మెలొడీస్

2021: ఏడాదికి 
ఉత్తమ చిత్రంగా ఆర్‌ఆర్‌ఆర్‌, 
రెండో ఉత్తమ చిత్రంగా అఖండ, 
మూడో ఉత్తమ చిత్రంగా ఉప్పెన

2022: ఏడాదికి 
ఉత్తమ చిత్రంగా సీతారామం, 
రెండో ఉత్తమ చిత్రంగా కార్తికేయ 2, 
మూడో ఉత్తమ చిత్రంగా మేజర్

2023 ఏడాదికి 
ఉత్తమ చిత్రంగా బలగం, 
రెండో ఉత్తమ చిత్రంగా హనుమాన్‌, 
మూడో ఉత్తమ చిత్రంగా భగవంత్‌ కేసరి
Gaddar
Gaddar Awards
Telangana Film Awards
Dil Raju
Run Raja Run
Rudramadevi
Baahubali 2
RRR Movie
Balagam Movie
Telangana Cinema

More Telugu News