Manchu Manoj: 'ఆయ‌న కొడుకు వ‌చ్చాడ‌ని చెప్పు'.. మంచు మ‌నోజ్ ఆస‌క్తిక‌ర పోస్ట్

Manchu Manoj Shares Interesting Post on Bhairavam Release
  • 'భైర‌వం' సినిమా విడుద‌ల నేప‌థ్యంలో మ‌నోజ్ 'ఎక్స్' వేదిక‌గా పోస్ట్
  • 'పెద‌రాయుడు' మూవీలోని మోహ‌న్ బాబు ఫొటో ప‌క్క‌న‌ త‌న ఫొటోను ఎడిట్ చేసి పంచుకున్న హీరో
  • ఫొటోకు 'ఆయ‌న కొడుకు వ‌చ్చాడ‌ని చెప్పు' అనే ఇంట్రెస్టింగ్‌ క్యాప్ష‌న్‌
తాను న‌టించిన 'భైర‌వం' సినిమా ఇవాళ విడుద‌లైన నేప‌థ్యంలో హీరో మంచు మ‌నోజ్ 'ఎక్స్' (గ‌తంలో ట్విట్ట‌ర్‌) వేదిక‌గా ఆస‌క్తిక‌ర పోస్ట్ పెట్టారు. 'పెద‌రాయుడు' మూవీలోని మోహ‌న్ బాబు ఫొటో ప‌క్క‌న‌త‌న ఫొటోను ఎడిట్ చేసి పంచుకున్నారు. దీనికి "ఆయ‌న కొడుకు వ‌చ్చాడ‌ని చెప్పు" అనే క్యాప్ష‌న్ ఇచ్చారు. 

కాగా, తండ్రి మోహ‌న్ బాబుతో వివాదాలు కొన‌సాగుతున్న వేళ ఆయ‌న ఈ పోస్టు చేయ‌డం గ‌మ‌నార్హం. త‌న తండ్రి పాదాల‌ను తాకాల‌ని ఉందంటూ ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో మ‌నోజ్ భావోద్వేగానికి గురైన విష‌యం తెలిసిందే. 

ఇదిలాఉంటే... మంచు మనోజ్, బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ కలిసి చేసిన చిత్రం 'భైర‌వం' ఈరోజు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. విజయ్ కనకమేడల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ మూవీకి ఇప్పటి వరకు ప్రమోషన్స్ కూడా బాగానే చేశారు. మనోజ్ సినిమాలకు దాదాపు తొమ్మిదేళ్లు దూర‌మైన త‌ర్వాత చేసిన మూవీ ఇది. దీంతో ఆయ‌న అభిమానులు ఈ చిత్రం కోసం ఎంతో ఆత్రుత‌గా ఎదురుచూశారు.  
Manchu Manoj
Bhairavam Movie
Mohan Babu
Pedarayudu Movie
Bellamkonda Sreenivas
Nara Rohit
Telugu Cinema
Vijay Kanakamedala
Manchu Family
Telugu Movies 2024

More Telugu News