Sandeep Vanga: సందీప్ వంగాకు రామ్ చరణ్, ఉపాసన నుంచి ఊహించని గిఫ్ట్

Sandeep Vanga Receives Surprise Gift From Ram Charan and Upasana
  • ‘అత్తమాస్ కిచెన్’ ఆవకాయ జాడీ పంపిన మెగా జంట
  • ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటో షేర్ చేసి కృతజ్ఞతలు తెలిపిన సందీప్
  • ప్రభాస్‌తో ‘స్పిరిట్’ సినిమా పనుల్లో బిజీగా ఉన్న సందీప్
ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం తన సినిమాలతో బిజీగా ఉన్నారు. ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన, తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతుల నుంచి ఊహించని సర్‌ప్రైజ్ అందుకున్నారు. ఈ విషయాన్ని సందీప్ సోషల్ మీడియా ద్వారా పంచుకోవడంతో ఇది కాస్త వైరల్‌గా మారింది.

రామ్ చరణ్, ఉపాసన దంపతులు తమ ‘అత్తమాస్ కిచెన్’ నుంచి ప్రత్యేకంగా తయారు చేసిన ఆవకాయ పచ్చడి జాడీని సందీప్ రెడ్డి వంగాకు పంపించారు. దానితో పాటు ఓ ప్రేమపూర్వక సందేశాన్ని కూడా జతచేశారు. ఈ అనూహ్య కానుకకు సందీప్ రెడ్డి వంగా ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. వెంటనే ఇన్‌స్టాగ్రామ్‌లో ఆవకాయ జాడీ ఫొటోను షేర్ చేస్తూ, "ఈ సర్‌ప్రైజ్ చాలా బాగుంది, టేస్టీగా కూడా ఉంటుంది" అని రాసుకొచ్చారు. చరణ్ దంపతులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా, నెటిజన్లు వావ్, సూపర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో ‘స్పిరిట్’ అనే భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ మొదటిసారి పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నారు. అయితే, ఈ సినిమా హీరోయిన్ ఎంపిక విషయంలో గతంలో కొంత వివాదం నడిచినట్లు వార్తలు వచ్చాయి. తొలుత దీపికా పదుకునేను ఎంపిక చేసి, కథా చర్చల అనంతరం కొన్ని మనస్పర్థల కారణంగా ఆమెను ప్రాజెక్ట్ నుంచి తప్పించి, మరొక నాయికను ఖరారు చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో దీపిక పీఆర్ టీమ్ ద్వారా ఈ సినిమాకు చెందిన కొన్ని కథనాలు లీక్ అవుతున్నాయని సందీప్ రెడ్డి వంగా సోషల్ మీడియా వేదికగా పరోక్షంగా విమర్శలు గుప్పించారు.
Sandeep Vanga
Ram Charan
Upasana
Attammas Kitchen
Avakaya Pachadi
Prabhas Spirit Movie
Deepika Padukone
Tollywood
Indian Cinema
Director

More Telugu News