Chandrababu Naidu: మహానాడుకు ఎన్టీఆర్ కుటుంబం రాకపోవడం అనుమానాలకు తావిస్తోంది: తోపుదుర్తి

- చంద్రబాబు పాలన గందరగోళంగా సాగుతోందన్న తోపుదుర్తి
- మహానాడులో ఎన్టీఆర్ ఏఐ వీడియో హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా
- చంద్రబాబు రాయలసీమ ద్రోహి అని విమర్శ
రాష్ట్రంలో చంద్రబాబు పాలన గందరగోళంగా సాగుతోందని వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదర్తి ప్రకాశ్ రెడ్డి విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని చెప్పారు. మహానాడు కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబం రాకపోవడం అనుమానాలకు తావిస్తోందని అన్నారు. మహానాడులో ప్రదర్శించిన ఎన్టీఆర్ ఏఐ వీడియో హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు.
చంద్రబాబుకు మతిమరుపు వచ్చిందనే అనుమానాలు కలుగుతున్నాయని... చేయని పనులను కూడా చేసినట్టుగా చెప్పుకుంటున్నారని తోపుదుర్తి ఎద్దేవా చేశారు. రెడ్ బుక్ అంటూ నారా లోకేశ్ గొప్పగా చెప్పుకోవడం సిగ్గుచేటని అన్నారు.
పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయలేని చంద్రబాబు... బనకచర్ల ప్రాజెక్టు అంటూ ఊదరగొడుతున్నారని విమర్శించారు. వెన్నుపోటు, కరవు, అబద్ధాలకు చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పారు. చంద్రబాబు రాయలసీమ బిడ్డ కాదని... సీమ ద్రోహి అని మండిపడ్డారు. నిజమైన రాయలసీమ బిడ్డలు... వైఎస్సార్, జగన్ అని అన్నారు.