Aditi Bhavaraju: ‘దండోరా’ మూవీతో నటిగా ఎంట్రీ ఇస్తున్న సింగ‌ర్ అదితి భావ‌రాజు

Aditi Bhavaraju to debut as actress in Dandora movie
  • గ్రామీణ తెలంగాణ నేపథ్యంతో రూపొందుతున్న ‘దండోరా’ మూవీ
  • లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సినిమాను నిర్మిస్తున్న రవీంద్ర బెనర్జీ ముప్పనేని
  • సామాజిక దుష్పరివర్తనలను ఆవిష్కరించే మూవీ
  • కీలక పాత్రలో కనిపించనున్న అదితి భావరాజు
లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌ను స్థాపించి తొలి చిత్రం ‘క‌లర్‌ఫొటో’తో అందరి దృష్టిని ఆక‌ర్షించిన డైన‌మిక్ ప్రొడ్యూస‌ర్ ర‌వీంద్ర బెన‌ర్జీ ముప్ప‌నేని.. ఆ త‌ర్వాత ‘బెదురులంక 2012’ వంటి సూప‌ర్ హిట్ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పుడు ‘దండోరా’ మూవీతో వస్తున్నారు. ఈ చిత్రానికి ముర‌ళీకాంత్ ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్నారు. 

గ్రామీణ తెలంగాణ నేప‌థ్యంలో రూపొందుతోన్న‘దండోరా’లో బలమైన ప్రేమ క‌థాంశంతో పాటు క‌ఠిన‌మైన నిజాలను, స‌మాజంలో కొన‌సాగుతోన్న సామాజిక దుష్ప్రవర్తనను ఆవిష్క‌రించే ప్ర‌యత్నం చేస్తున్నారు. ఇందులో శివాజీ, న‌వదీప్‌, నందు, ర‌వికృష్ణ‌, మ‌నికా చిక్కాల‌, మౌనికా రెడ్డి, బిందు మాధ‌వి, రాధ్య త‌దిత‌రులు ప్ర‌ధాన పాత్ర‌ల్లో మెప్పించ‌నున్నారు. 

అలాగే, టాలెంటెడ్ సింగ‌ర్ అదితి భావ‌రాజు న‌టిగా ఈ చిత్రంతో సిల్వ‌ర్ స్క్రీన్‌పై ఎంట్రీ ఇస్తున్నారు. ఎన్నో చార్ట్ బ‌స్ట‌ర్ సాంగ్స్‌ను ఆల‌పించిన అదితి..‘దండోరా’ చిత్రంతో వెండి తెరపై మెరవనున్నారు. ఆమె ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. 

‘దండోరా’ మూవీ ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. తెలంగాణ‌లోని గ్రామీణ ప్రాంతాల్లో ప‌లు కీల‌క షెడ్యూల్స్‌ను పూర్తి చేశారు. ఇటీవ‌ల విడుద‌లైన మూవీ ఫ‌స్ట్ బీట్ టీజ‌ర్‌కు మంచి స్పంద‌న వ‌చ్చింది. దీంతో సినిమాపై అంచ‌నాలు మ‌రింత పెరిగాయి. రాబోయే రోజుల్లో సినిమా నుంచి మ‌రిన్ని ఆస‌క్తిక‌ర‌మైన విశేషాల‌ను తెలియ‌జేస్తామ‌ని మేక‌ర్స్ తెలియ‌జేశారు. 

మురళీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్నఈ సినిమాకు మార్క్ కె.రాబిన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. వెంకట్ ఆర్.శాఖ‌మూరి సినిమాటోగ్రాఫ‌ర్‌గా, సృజ‌న అడుసుమిల్లి ఎడిట‌ర్‌గా, క్రాంతి ప్రియం ఆర్ట్ డైరెక్ట‌ర్‌గా, రేఖా బొగ్గార‌పు కాస్ట్యూమ్ డిజైన‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు. ఎడ్వ‌ర్డ్ స్టీవెన్‌స‌న్ పెరెజి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌గా, కొండారు వెంక‌టేశ్ లైన్ ప్రొడ్యూస‌ర్‌గా బాధ్య‌త‌ల‌ను నిర్వ‌ర్తిస్తున్నారు.
Aditi Bhavaraju
Dandora Movie
Telugu Movie
Singer Aditi
Ravindra Bannerjee Muppaneni
Muralikanth
Bindu Madhavi
Telangana
Tollywood
Movie News

More Telugu News