Sreeleela: పెళ్లికూతురి గెటప్‌లో శ్రీలీల.. ఫ్యాన్స్ షాక్!

Sreeleela in bridal look shocks fans
  • శ్రీలీల పోస్ట్ చేసిన ఫొటోలతో సోషల్ మీడియాలో పెద్ద చర్చ
  • పెళ్లికూతురిలా ముస్తాబై, పసుపు రాసుకున్న ఫొటోలు షేర్ చేసిన శ్రీలీల
  • "నాకు ఈ రోజు చాలా పెద్దది" అంటూ క్యాప్షన్
యంగ్ హీరోయిన్ శ్రీలీల తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొన్ని ఫొటోలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఈ ఫొటోల్లో శ్రీలీల పెళ్లికూతురి గెటప్‌లో కనిపించడంతో పాటు, కొందరు ఆమె చెంపలకు పసుపు రాస్తున్న దృశ్యాలు ఉన్నాయి. దీనికితోడు "నాకు ఈ రోజు చాలా పెద్దది (బిగ్ డే). పూర్తి వివరాలు త్వరలోనే చెబుతాను, కమింగ్ సూన్" అంటూ ఆమె రాసుకొచ్చిన క్యాప్షన్ మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఈ పోస్ట్ చూసిన అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. శ్రీలీలకు రహస్యంగా నిశ్చితార్థం జరిగిపోయిందా? లేక పెళ్లి చేసుకోబోతోందా? అంటూ రకరకాల కామెంట్లు పెడుతున్నారు. అయితే, మరికొందరు మాత్రం ఇవి నిజమైన వేడుక ఫొటోలు కావని, ఏదైనా కొత్త సినిమా ప్రమోషన్ లేదా వాణిజ్య ప్రకటనకు సంబంధించినవి అయిఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు.

ప్రస్తుతం శ్రీలీల బాలీవుడ్‌లో కార్తీక్ ఆర్యన్‌తో ఒక సినిమా, తెలుగులో రవితేజ సరసన మరో చిత్రంలో నటిస్తోంది. తమిళంలో కూడా రెండు సినిమాలకు సంతకం చేసిందని వార్తలు వస్తున్నప్పటికీ, అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఏదేమైనా, శ్రీలీల పెట్టిన ఈ పోస్ట్ ఇప్పుడు నెట్టింట పెద్ద చర్చకు దారితీసింది. అసలు విషయం ఏంటో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
.
Sreeleela
Sreeleela wedding
Sreeleela actress
Telugu cinema
Bollywood movie
Ravi Teja movie
Karthik Aaryan movie
actress Sreeleela
Sreeleela photos

More Telugu News