Kavitha: ఇందిరా పార్క్ వద్ద నిరసనకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పిలుపు

Kavitha calls for protest at Indira Park
  • మాజీ సీఎం కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు
  • నిరసన తెలుపుతూ ఎమ్మెల్సీ కవిత పిలుపు
  • జూన్ 4న ఇందిరా పార్క్ వద్ద ధర్నాకు సన్నాహాలు
  • తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం
కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జ్యుడీషియల్ కమిషన్ నోటీసులు జారీ చేయడంపై ఆ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రంగా స్పందించారు. కమిషన్ చర్యను ఖండిస్తూ ఆమె నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు.

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కూడా అయిన కవిత, జూన్ 4వ తేదీన హైదరాబాద్ నగరంలోని ఇందిరా పార్క్ వద్ద ఈ నిరసన చేపట్టనున్నట్లు వెల్లడించారు. కేసీఆర్‌కు కమిషన్ నోటీసులు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ, తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమం జరుగుతుందని ఆమె తెలిపారు.

ఇదిలా ఉండగా, ఈరోజు సాయంత్రం నగరంలోని బంజారాహిల్స్‌లో తెలంగాణ జాగృతి సంస్థ నూతన కార్యాలయాన్ని కూడా ఎమ్మెల్సీ కవిత ప్రారంభించనున్నారు.
Kavitha
Kalvakuntla Kavitha
BRS MLC Kavitha
Kaleshwaram Project
KCR

More Telugu News