WhatsApp: వాట్సాప్ స్టేటస్‌ కోసం నాలుగు సరికొత్త ఫీచర్లు.. ఇక‌పై యూజ‌ర్ల‌కు స‌రికొత్త అనుభ‌వం!

WhatsApp Status Get Four New Features for Enhanced Experience
  • తన స్టేటస్ సెక్షన్‌ను మరింత ఆక‌ర్ష‌ణీయంగా మార్చే ప‌నిలో వాట్సాప్ 
  • యూజ‌ర్ల కోసం నచ్చిన లేఅవుట్‌, మోర్‌ విత్‌ మ్యూజిక్‌, ఫొటో స్టిక్కర్స్‌, యాడ్‌ యువర్స్ ఫీచ‌ర్లు
  • ఈ విషయాన్ని తన అధికారిక బ్లాగ్‌లో ప్రకటించిన వాట్సాప్‌ మాతృసంస్థ మెటా
ప్ర‌ముఖ‌ మెసేజింగ్ యాప్‌ వాట్సాప్ తన స్టేటస్ సెక్షన్‌ను మరింత ఆక‌ర్ష‌ణీయంగా మార్చడానికి త్వరలో మరో నాలుగు సరికొత్త స్టేటస్‌ ఫీచర్లను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ విషయాన్ని మెటా తన అధికారిక బ్లాగ్‌లో ప్రకటించింది. నచ్చిన లేఅవుట్‌, మోర్‌ విత్‌ మ్యూజిక్‌, ఫొటో స్టిక్కర్స్‌, యాడ్‌ యువర్స్ అనే నాలుగు స్టేటస్‌ ఫీచర్లను యూజర్లకు త్వరలో పరిచయం చేయనున్నట్లు తెలిపింది

కొల్లెజ్‌లను సృష్టించడానికి లేఅవుట్ ఫీచర్
వాట్సాప్ యాప్‌లోనే కొల్లేజ్‌ (collage)ను సృష్టించే సౌకర్యాన్ని అందిస్తోంది. నచ్చిన లేఅవుట్ ల‌తో కొల్లేజ్‌ను రూపొందించవచ్చు. ఎడిటింగ్‌ టూల్స్ సాయంతో స్టేటస్‌లను మరింత ఆకర్షణీయంగా తయారు చేసుకోవచ్చు. యూజర్లు గరిష్ఠంగా ఆరు ఫొటోలను ఎంచుకొని, వాటిని వివిధ లేఅవుట్‌లలో కొల్లేజ్‌గా రూపొందించుకోవచ్చు.

మోర్‌ విత్‌ మ్యూజిక్‌
వాట్సప్‌ స్టేటస్‌లకు మ్యూజిక్‌ యాడ్‌ చేసే సదుపాయాన్ని మెసేజింగ్‌ ప్లాట్‌ఫామ్‌ తాజాగా తీసుకొచ్చింది. ఈ ‘మోర్‌ విత్‌ మ్యూజిక్‌’ ఫీచర్‌తో యూజర్లు ఒక పాటను నేరుగా వారి స్టేటస్‌గా పోస్ట్‌ చేయొచ్చు.

ఫొటో స్టిక్కర్లు
ఫొటోలను స్టిక్కర్లుగా మార్చుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. దీని సాయంతో ఫొటోను స్టిక్కర్‌గా మార్చేసి స్టేటస్‌లో పోస్ట్‌ చేయొచ్చు. మీకు నచ్చిన విధంగా స్టైలింగ్‌ చేస్తూ ప్రత్యేకతను చాటొచ్చు.

యాడ్‌ యువర్స్
ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి ప్లాట్‌ఫామ్‌ల్లో ఇప్పటికే విజయవంతమైన ఇంటరాక్టివ్‌ టూల్‌ ‘యాడ్‌ యువర్స్’ ఫీచర్‌ త్వరలో వాట్సప్‌లోకి వచ్చేస్తోంది. దీనివల్ల యూజర్లు తమ ఫ్రెండ్స్‌ను స్టేటస్‌ సంభాషణలో చేర్చొచ్చు. ఈ కొత్త ఫీచర్లతో వాట్సప్‌ స్టేటస్‌ మరింత ఆకర్షణీయంగా మారుతుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.
WhatsApp
WhatsApp Status
Status Features
Meta
Messaging App
Add Yours
Photo Stickers
More with Music
Layout Feature

More Telugu News