Chandrababu Naidu: ఏపీలో పింఛన్ల జాతర .. తొలి రోజే 92 శాతం మందికి పంపిణీ

Chandrababu Naidu Government Distributes Pensions to 92 Percent in AP on First Day
  • శరవేగంగా ఏపీలో పింఛన్ల పంపిణీ
  • ముమ్మడివరంలో పింఛన్ల పంపిణీలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
  • తొలి రోజు అత్యధికంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో పింఛన్ల పంపిణీ 
రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం జోరుగా కొనసాగుతోంది. శనివారం ఉదయమే పింఛన్ల పంపిణీ ప్రారంభం కాగా, మొదటి రోజే 92.67 శాతం పంపిణీ పూర్తయింది. జూన్ 1వ తేదీ (ఆదివారం) సెలవు దినం కావడంతో, ప్రభుత్వం ఒకరోజు ముందుగానే పింఛన్లు పంపిణీ చేయాలని నిర్ణయించింది.

శనివారం రాత్రి వరకు మొత్తం 58 లక్షల 59 వేల 688 మంది (92.67 శాతం) లబ్ధిదారులకు గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది వారి ఇళ్ల వద్దే పింఛన్లు అందజేశారు. మొత్తం 63 లక్షల మందికి పింఛన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం రూ.2,717 కోట్లు విడుదల చేసింది. మొదటి రోజు అత్యధికంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 94 శాతం పైగా పింఛన్ల పంపిణీ పూర్తయింది.

బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా చెయ్యేరులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా పింఛన్ల పంపిణీ జరగగా, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒక రోజు ముందుగానే లబ్ధిదారులకు పింఛను మొత్తాలను అందజేయడంతో వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 
Chandrababu Naidu
Andhra Pradesh
NTR Bharosa Pension
Pension distribution
AP pensions
Alluri Sitarama Raju district
BC Ambedkar Konaseema district
Welfare schemes
Government schemes
Pension disbursement

More Telugu News