Sharmistha Panoly: కోల్ కతా లా స్టూడెంట్ శర్మిష్ఠ పనోలీకి నెదర్లాండ్స్ ఎంపీ మద్దతు

Sharmistha Panoly Netherlands MP Supports Arrested Kolkata Law Student
  • ఆపరేషన్ సిందూర్'పై పోస్ట్‌తో కోల్‌కాతాలో న్యాయ విద్యార్థిని శర్మిష్ఠ అరెస్ట్
  • ఈ అరెస్ట్‌ను ఖండించిన డచ్ ఎంపీ గీర్ట్ వైల్డర్స్
  • శర్మిష్ఠను విడుదల చేయాలని ప్రధాని మోదీకి ఆయన విజ్ఞప్తి
  • ఇది వాక్ స్వాతంత్ర్యాన్ని హరించడమేనని వైల్డర్స్ అభిప్రాయం
  • శర్మిష్ఠకు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధింపు
  • బాలీవుడ్ నటులను విమర్శిస్తూ శర్మిష్ఠ వీడియో పోస్ట్ చేసి, తర్వాత డిలీట్ చేసిన వైనం
సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్ కారణంగా పశ్చిమ బెంగాల్ లో 22 ఏళ్ల న్యాయ విద్యార్థిని శర్మిష్ఠ పనోలీ అరెస్ట్ కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 'ఆపరేషన్ సిందూర్' సమయంలో అభ్యంతరకరమైన రీతిలో ఆమె ఒక వీడియో పోస్ట్ చేసిందనే ఆరోపణలపై కోల్‌కతా పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అయితే అనూహ్య రీతిలో నెదర్లాండ్స్‌కు చెందిన పార్లమెంట్ సభ్యుడు గీర్ట్ వైల్డర్స్ నుంచి శర్మిష్ఠ పనోలీకి మద్దతు లభించింది. తీవ్రంగా స్పందించారు. శర్మిష్ఠ అరెస్ట్ వాక్ స్వాతంత్ర్యాన్ని కాలరాయడమేనని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ విషయంపై గీర్ట్ వైల్డర్స్ సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ, శర్మిష్ఠ పనోలీ చాలా ధైర్యవంతురాలని, కేవలం ఒక సోషల్ మీడియా పోస్ట్ ఆధారంగా ఆమెను అరెస్ట్ చేయడం సరికాదని అన్నారు. కోల్‌కతా పోలీసుల చర్య భారతదేశంలో భావ ప్రకటనా స్వేచ్ఛకు విఘాతం కలిగించేలా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. శర్మిష్ఠను శిక్షించవద్దని కోరుతూ, ఆమెను తక్షణమే విడుదల చేయాలని అధికారులను ఆదేశించాల్సిందిగా భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన విజ్ఞప్తి చేశారు. "ప్రస్తుతం అందరి దృష్టి శర్మిష్ఠపైనే ఉంది" అని పేర్కొంటూ, ఆమె ఫోటోను కూడా వైల్డర్స్ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు.

వివరాల్లోకి వెళితే, 'ఆపరేషన్ సిందూర్' సమయంలో బాలీవుడ్ నటులు మౌనంగా ఉన్నారంటూ వారిని ఉద్దేశిస్తూ శర్మిష్ఠ పనోలీ ఇటీవల సోషల్ మీడియాలో ఒక వీడియోను పోస్ట్ చేసింది. అయితే, ఈ పోస్ట్‌పై తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆమె వెంటనే దాన్ని తొలగించి, క్షమాపణలు కూడా చెప్పింది. అయినప్పటికీ, ఆమెపై పలు ఫిర్యాదులు అందడంతో పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అనంతరం శర్మిష్ఠను కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం ఆమెకు 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఈ పరిణామాల నేపథ్యంలో డచ్ ఎంపీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
Sharmistha Panoly
Geert Wilders
Netherlands MP
Kolkata Law Student
Operation Sindoor
Freedom of Speech India
Social Media Post Arrest
West Bengal
Narendra Modi
Indian Politics

More Telugu News