Shyamali Nidimoru: మరోసారి తన పోస్ట్ తో కలకలం రేపిన దర్శకుడు రాజ్ నిడిమోరు భార్య శ్యామలి

Shyamali Nidmorus post creates a stir again
  • కాలం అన్నింటినీ బయటపెడుతుంది, కర్మ సమాధానం చెబుతుంది" అని వ్యాఖ్య
  • "కర్మ", "నువ్వు ఏం ఇస్తావో అదే నీకు తిరిగి వస్తుంది" అనే హ్యాష్‌ట్యాగ్‌లు
  • రాజ్ నిడిమోరు, సమంత సన్నిహితంగా ఉన్నారనే ప్రచారం నేపథ్యంలో ఈ పోస్ట్
  • శనివారం రాజ్‌తో పికల్‌బాల్ ఆడుతున్న ఫోటోలు షేర్ చేసిన సమంత
  • శ్యామలి పోస్ట్, సమంత ఫోటోలు ఒకే సమయంలో రావడంతో తీవ్ర చర్చ
ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరు అర్ధాంగి శ్యామలి నిడిమోరు ఇటీవల సోషల్ మీడియాలో పెడుతున్న కొన్ని పోస్టులు తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. తాజాగా ఆమె 'కర్మ సిద్ధాంతం' గురించి చేసిన ఒక ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ నెట్టింట వైరల్‌గా మారింది. "కాలం అన్నింటినీ బయటపెడుతుంది.. కర్మ సమాధానం చెబుతుంది. ఈ విశ్వం దీనిని నిశితంగా చూస్తుంటుంది" అనే అర్థం వచ్చేలా ఉన్న ఒక సందేశాన్ని ఆమె పంచుకున్నారు. ఈ పోస్ట్‌కు "కర్మ", "నువ్వు ఏం ఇస్తావో అదే నీకు తిరిగి వస్తుంది" (#karma #whatyougiveiswhatyouget) అనే హ్యాష్‌ట్యాగ్‌లను కూడా జతచేయడం గమనార్హం. ఈ పోస్ట్ వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏమై ఉంటుందా అని నెటిజన్లు రకరకాలుగా చర్చించుకుంటున్నారు.

శ్యామలి, రాజ్ నిడిమోరుల వివాహం 2015లో జరిగింది. పెళ్లి తర్వాత రాజ్ నిడిమోరు దర్శకత్వం వహించిన పలు చిత్రాలకు శ్యామలి క్యాస్టింగ్ విభాగంలో సహాయం అందించారని గతంలో పలు ఇంటర్వ్యూలలో రాజ్ స్వయంగా వెల్లడించారు. అయితే, కొంతకాలంగా రాజ్, శ్యామలి విడిపోతున్నారంటూ వార్తలు వస్తున్నప్పటికీ, ఈ వార్తలపై వారిద్దరూ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.

మరోవైపు, రాజ్ నిడిమోరు, డీకే ద్వయం దర్శకత్వం వహించిన 'ది ఫ్యామిలీమ్యాన్ సీజన్ 2', 'సిటడెల్: హనీ బన్నీ' వంటి ప్రాజెక్టులలో నటి సమంత నటించారు. ఈ ప్రాజెక్టుల సమయంలో రాజ్, సమంతల మధ్య మంచి పరిచయం ఏర్పడింది. సమంత నిర్మాతగా వ్యవహరించిన తొలి చిత్రానికి కూడా రాజ్ నిడిమోరు క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. సినిమా ప్రమోషన్లలో కూడా వీరిద్దరూ కలిసి కనిపించడంతో, వారి మధ్య ఏదో సంబంధం ఉందంటూ ప్రచారం ఊపందుకుంది.

ఇదిలా ఉండగా, శనివారం నాడు సమంత తన వారంతపు కార్యకలాపాలకు సంబంధించిన కొన్ని ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. అందులో ఆమె జిమ్‌లో వర్కౌట్లు చేస్తున్న దృశ్యాలతో పాటు, రాజ్ నిడిమోరుతో కలిసి పికిల్‌బాల్ ఆడుతున్న ఫోటోలు కూడా ఉన్నాయి. సమంత ఈ ఫోటోలను షేర్ చేసిన సమయంలోనే శ్యామలి కూడా కర్మ గురించి పోస్ట్ పెట్టడం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. 
Shyamali Nidimoru
Raj Nidimoru
Samantha Ruth Prabhu
The Family Man 2
Citadel Honey Bunny
Karma
Bollywood
Divorce rumors
Social media post
Pickleball

More Telugu News