Nadendla Manohar: ఈ నెల 4న పండుగ చేసుకుందాం: మంత్రి నాదెండ్ల మనోహర్

Nadendla Manohar calls for celebrations on 4th of this month
  • ఈ నెల 4న సంక్రాంతి, దీపావళి కలిపి చేసుకుందామన్న మంత్రి నాదెండ్ల మనోహర్
  • సంబరాల ఫోటోలు సోషల్ మీడియాలో పోస్టు చేయాలని వినతి
  • సుపరిపాలనకు ప్రారంభమై ఏడాది పేరుతో సంబరాలు
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఈ నెల 4న సంబరాలు చేసుకుందామని జనసేన నేత, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు.

జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో నిన్న నాదెండ్ల మనోహర్ నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సుపరిపాలనకు ఏడాది పేరుతో సంక్రాంతి, దీపావళి కలిపి చేసుకుందామని పార్టీ శ్రేణులకు సూచించారు.

మహిళలు ముగ్గులు వేసి కూటమి విజయాన్ని పండుగగా నిర్వహించాలని తెలిపారు. పీడ విరగడై ఏడాది పేరుతో దీపాలు వెలిగించి టపాసులు కాల్చాలని చెప్పారు. ఈ సంబరాలకు సంబంధించి ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయాలని సూచించారు. 
Nadendla Manohar
Andhra Pradesh
Coalition Government
Pawan Kalyan
Pithapuram
Janasena
Celebrations
Anniversary
Telugu News

More Telugu News