Bangladesh Currency: హిందూ ఆలయాల బొమ్మలతో కొత్త కరెన్సీ తీసుకువచ్చిన బంగ్లాదేశ్

Bangladesh Introduces New Currency with Hindu Temple Images
  • హిందూ ఆలయాల బొమ్మలతో కొత్త కరెన్సీ తీసుకువచ్చిన బంగ్లాదేశ్
  • కీలక చర్యలు చేపట్టిన బంగ్లాదేశ్ లోని తాత్కాలిక ప్రభుత్వం
  • కరెన్సీ నోట్లపై మానవ చిత్రాలు ఉండవని, వాటికి బదులుగా పకృతి, ప్రాచుర్యం పొందిన ప్రదేశాలు ఉంటాయన్న బంగ్లాదేశ్ బ్యాంక్ అధికార ప్రతినిధి
  • కొత్త నోట్లు నిన్న విడుదల  
బంగ్లాదేశ్‌లోని తాత్కాలిక ప్రభుత్వం కీలక చర్యలకు ఉపక్రమించింది. హిందూ ఆలయాల బొమ్మలతో కూడిన నూతన కరెన్సీని విడుదల చేసింది. మాజీ ప్రధాని షేక్ ముజిబుర్ రెహమాన్ చిత్రం ముద్రించిన కరెన్సీ నోట్ల స్థానంలో సరికొత్త డిజైన్‌తో ఈ నోట్లను ప్రవేశపెట్టింది. హిందూ, బౌద్ధ ఆలయాల చిత్రాలను కరెన్సీ నోట్లపై ముద్రిస్తోంది. నిన్నటి నుంచి కొత్త నోట్ల జారీ ప్రారంభమైంది.

నూతన డిజైన్, సిరీస్ ప్రకారం కరెన్సీ నోట్లపై మానవ చిత్రాలకు బదులుగా ప్రకృతి, ప్రసిద్ధ ప్రదేశాల చిత్రాలు ఉంటాయని బంగ్లాదేశ్ బ్యాంక్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. చారిత్రక ప్రదేశాలతో పాటు హిందూ, బౌద్ధ ఆలయాల చిత్రాలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా, దివంగత చిత్రకారుడు జైనుల్ అబెదిన్ గీసిన కళాఖండాలు కూడా ఉంటాయని వెల్లడించారు. మొత్తం తొమ్మిది డిజైన్లను రూపొందించగా, కొత్త నోట్లను నిన్న విడుదల చేశారు.

తూర్పు పాకిస్థాన్ నుంచి బంగ్లాదేశ్‌గా పేరు మార్చుకున్న తర్వాత 1972లో కరెన్సీ నోట్లపై ఓ మ్యాప్‌ను ముద్రించారు. అనంతరం షేక్ హసీనా తండ్రి ముజిబుర్ రెహమాన్ చిత్రంతో కూడిన నోట్లను విడుదల చేశారు. గత ఏడాది ఆగస్టులో షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిపోయిన తర్వాత తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడినప్పటికీ, ఆమె తండ్రి చిత్రం ఉన్న కరెన్సీ నోట్లను కొనసాగించారు. 
Bangladesh Currency
Bangladesh
Hindu Temples
Currency Design
Bangladeshi Taka
Sheikh Mujibur Rahman
Bangladesh Bank
New Currency Notes
Bangladeshi Economy

More Telugu News