Pawan Kalyan: పవన్ కల్యాణ్, లోకేశ్ లకు జవాన్ రిక్వెస్ట్.. వీడియో ఇదిగో!

Jawan Appeals to Pawan Kalyan Nara Lokesh Over Land Dispute
  • సార్ మీరే న్యాయం చేయాలంటూ వేడుకోలు
  • తన భూమిని కబ్జా చేశారంటూ ఆవేదన
  • కోర్టు తీర్పు ఇచ్చినా ఖాళీ చేయడంలేదని ఆరోపణ
దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో కాపలా కాస్తున్న జవాన్ కు సొంత ఊరిలో కొంతమంది అన్యాయం తలపెట్టారు.. జవాన్ కు చెందిన భూమిని కబ్జా చేశారు. సదరు భూమి జవాన్ దేనని కోర్టు తీర్పిచ్చినా కబ్జాదారులు ఖాళీ చేయడంలేదు. దీంతో ఆ జవాన్ ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ లను ఆశ్రయించాడు. ‘మీరే న్యాయం చేయాలి’ అంటూ సెల్ఫీ వీడియో ద్వారా అభ్యర్థించాడు.

శ్రీ స‌త్య‌సాయి జిల్లా హుదుగూరుకు చెందిన జవాన్ నరసింహమూర్తి ఈమేరకు పవన్ కల్యాణ్, నారా లోకేశ్ లకు సెల్ఫీ వీడియో పంపారు. జమ్మూ నుండి వీడియో విడుద‌ల చేసిన జ‌వాన్.. ఆ భూమి త‌నదేనని కోర్టు కూడా తీర్పిచ్చిందని తెలిపారు. కోర్టు తీర్పును అమలుచేయాల్సిన రెవెన్యూ అధికారులు, పోలీసులు నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని జవాన్ నరసింహమూర్తి ఆరోపించారు.
Pawan Kalyan
Nara Lokesh
Jawan Narasimhamurthy
Andhra Pradesh
Sri Satya Sai District
Land Encroachment
Court Order
Revenue Officials
Police
Jawan Video Request

More Telugu News