YS Jagan: తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన జగన్, షర్మిల

Telangana Formation Day Greetings from Jagan and Sharmila
  • నేడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం
  • తెలంగాణ సోదర, సోదరీమణులకు శుభాకాంక్షలు అంటూ జగన్ ట్వీట్
  • రాష్ట్రాలు వేరైనా తెలుగు ప్రజలు అందరం ఒక్కటే అన్న షర్మిల
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వైసీపీ అధినేత జగన్, ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సోదర, సోదరీమణులందరికీ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు అని జగన్ ఎక్స్ వేదికగా తెలిపారు. 

"తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. రాష్ట్రాలుగా వేరైనా తెలుగు ప్రజలు అందరం ఒక్కటే. రాష్ట్రంలో నియంత పాలనకు, బానిసత్వానికి స్వస్తి చెప్పి, నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజా పాలన అందిస్తూ, హస్తమే అభయహస్తంగా 'తెలంగాణ రైజింగ్' నినాదంతో అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలుపుతూ, అభివృద్ధికి, సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారికి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్న గారికి,ఇతర కేబినెట్ మంత్రులకు, ఎమ్మెల్యేలకు, పార్టీ నేతలకు ప్రత్యేక శుభాకాంక్షలు" అని షర్మిల ట్వీట్ చేశారు.
YS Jagan
Telangana Formation Day
YS Sharmila
Telangana
Andhra Pradesh
Revanth Reddy
Bhatti Vikramarka
Telangana Rising

More Telugu News