Ashu Reddy: వేణు స్వామితో పూజలు చేయించుకున్న అషు రెడ్డి

Ashu Reddy Performs Special Pooja with Venu Swamy
  • అసోంలోని కామాఖ్య ఆలయంలో అషూ రెడ్డి ప్రత్యేక పూజలు
  • ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామితో కలిసి పూజా కార్యక్రమాలు
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అషు, వేణు స్వామి ఫొటోలు
సోషల్ మీడియాలో తన గ్లామర్ షోతో పాటు, అప్పుడప్పుడు వివాదాస్పద ఇంటర్వ్యూలతో వార్తల్లో నిలిచే నటి అషు రెడ్డి మరోసారి అందరి దృష్టిని ఆకర్షించారు. జూనియర్ సమంతగా పేరు తెచ్చుకున్న ఈమె, ఇటీవల అసోంలోని ప్రఖ్యాత కామాఖ్య దేవి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామితో కలిసి ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

బిగ్‌బాస్ సీజన్ 3, బిగ్‌బాస్ నాన్‌స్టాప్ షోలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన అషు రెడ్డి, పలు టీవీ కార్యక్రమాలు, సినిమాలు, వెబ్ సిరీస్‌లతో బిజీగా ఉంటున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈమె, తరచూ తన ఫొటోలు, వీడియోలను పంచుకుంటూ అభిమానులతో టచ్‌లో ఉంటారు. రామ్ గోపాల్ వర్మతో చేసిన ఓ ఇంటర్వ్యూ అప్పట్లో పెద్ద దుమారమే రేపింది. అయితే, గ్లామర్ ప్రపంచంలో ఉన్నప్పటికీ అషు రెడ్డికి దైవ చింతన కూడా ఎక్కువే అనిపిస్తోంది. గతంలో కూడా పలుమార్లు వేణు స్వామిని కలిసి పూజలు చేయించుకున్న సందర్భాలున్నాయి.

తాజాగా, అషు రెడ్డి కామాఖ్య ఆలయంలో వేణు స్వామితో కలిసి పూజలు చేస్తున్న ఫొటోలు, వీడియోలను తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు. ఇవి క్షణాల్లో వైరల్‌గా మారాయి. సెలబ్రిటీల జాతకాలు చెబుతూ, వారికి ఏమైనా దోషాలు ఉంటే పరిహార పూజలు నిర్వహించే వేణు స్వామి దగ్గర ఇప్పటికే పలువురు టాప్ హీరోయిన్లు కూడా పూజలు చేయించుకున్న విషయం తెలిసిందే.
Ashu Reddy
Venu Swamy
Kamakhya Temple
Assam
Pooja
Big Boss Telugu
Junior Samantha
Astrology
Telugu Actress
Ram Gopal Varma

More Telugu News