Malladi Vishnu: 4వ తేదీన 'వెన్నుపోటు దినం' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం: మల్లాది విష్ణు

Malladi Vishnu Announces Vennupotu Dinam Protest Against Chandrababu
  • ప్రజలను చంద్రబాబు మోసం చేశారన్న విష్ణు
  • టీడీపీకి ఓటు వేసి ప్రజలు మోసపోయారని వ్యాఖ్య
  • రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ అమలు కావడం లేదని విమర్శ
రాష్ట్రంలో రౌడీలు, పోలీసుల రాజ్యమే నడుస్తోందని వైసీపీ నేత మల్లాది విష్ణు అన్నారు. అమ్మకు వందనం, ఉచిత బస్సు అంటూ ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని... అందుకే ఈనెల 4న 'వెన్నుపోటు దినం' పేరుతో నిరసన కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు. విజయవాడ సెంట్రల్ నియోజకర్గంలోని వైసీపీ కార్యాలయంలో 'వెన్నుపోటు దినం' పోస్టర్ ను ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

టీడీపీకి ఓటు వేసి ప్రజలు మోసపోయారని విష్ణు అన్నారు. ఆస్తిపన్ను, కరెంట్ ఛార్జీలను పెంచిందని విమర్శించారు. ప్రజలకు ఉపయోగపడే గ్రామ సచివాలయాలను నిర్వీర్యం చేశారని అన్నారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ అమలు కావడం లేదని చెప్పారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తున్నారని విమర్శించారు.
Malladi Vishnu
Andhra Pradesh
YSRCP
Chandrababu Naidu
TDP
Vennupotu Dinam
Vijayawada
Political Protest
AP Politics
Government Schemes

More Telugu News